Begin typing your search above and press return to search.

నానికి అవార్డుల‌పై ఆశ లేదంట‌!

ప్ర‌తిభ‌ను గుర్తించి ఇచ్చే బ‌హుమ‌తి తీసుకోవ‌డం అంటే? ఏ న‌టుడికైనా అదో అచీవ్ మెంట్ లాంటింది.

By:  Tupaki Desk   |   4 Aug 2024 1:45 PM GMT
నానికి అవార్డుల‌పై ఆశ లేదంట‌!
X

ప్ర‌తిభ‌ను గుర్తించి ఇచ్చే బ‌హుమ‌తి తీసుకోవ‌డం అంటే? ఏ న‌టుడికైనా అదో అచీవ్ మెంట్ లాంటింది. అలాంటి అవార్డులొచ్చిన‌ప్పుడు అత‌డి ఖ్యాతి మ‌రింత పెరుగుతుంది. న‌టుడిగా అత‌డి స్థాయి మారిన‌ట్లు లెక్క‌. మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయాలి? అన్న విష‌యాన్ని అవార్డులు గుర్తు చేస్తుంటాయి. అయితే నేచుర‌ల్ స్టార్ నానికి మాత్రం అవార్డుల‌పై ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌టున్నాడు. ఫిలిం ఫేర్ వేడుక‌ల్లో భాగంగా నాని ఈ వ్యాఖ్య‌లు చేసాడు.

`ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన కొత్తలో న‌టులు స్టేజ్ పై అవార్డులు తీసుకుంటే అలా నేనెప్పుడు అందుకుటానా? అని క‌ల‌లు క‌నేవాడిని. ఓరోజు ఆ స్థాయికి వెళ్లాల‌ని నాకు బ‌ల‌మైన కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పుడు స‌న్న‌గి ల్లింది. ఇప్పుడు నా కొత్త కొరిక ఏంటంటే? నా సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు , టెక్నీషియ‌న్లు , న‌టీన‌టుల‌తో పాటు నిర్మాణ సంస్థ‌లో కొత్త‌గా ప‌రిచ‌య‌మైన వారితో ఇలాంటి అవార్డుల అందుకుంటే బాగుండ‌నిపిస్తుంది. ఈరోజు కూడా అవార్డు తీసుకోవ‌డానికి రాలేదు. శౌర్యువ్..శ్రీకాంత్ ఓదెల అవార్డులు తీసుకుంటే చూడాల‌ని వ‌చ్చాను.

ఉత్త‌మ ప‌రిచ‌య ద‌ర్శ‌కుల విభాగంలో వాళ్లిద్ద‌రికీ అవార్డులు రావ‌డం..వాటిని నా చేతుల మీదుగా అందించ‌డం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది ఎప్ప‌టికీ గుర్తిండిపోయే ఓ గొప్ప జ్ఞాప‌కం. కొత్త వాళ్ల తొలి అడుగులో నేను ఇటుకుగా మారితే అదే నాకు అతి పెద్ద అవార్డు. అది ఇచ్చే తృప్తి మాట‌ల్లో చెప్ప‌లేనిది` అని అన్నారు. కొత్త వాళ్ల‌ను ప‌రిచ‌యం చేయ‌డంలో నాని ముందుంటాడు.

ఇప్ప‌ట‌కే నాని సినిమాల ద్వారా చాలా మంది ద‌ర్శ‌కులు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. న‌వ‌త‌రం ట్యాలెట్ని ఎంక‌రేజ్ చేయ‌డంలో నాని స్పెష‌లిస్ట్. తెలివిగా వాళ్ల‌తోనే హిట్లు అందుకుంటాడు. నాని కెరీర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సుప్ర‌సిద్ద ద‌ర్శ‌కులు బాపు వ‌ద్ద కూడా నాని శిష్యుడిగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే.