ప్రభాస్ పై కామెంట్స్.. నాని, దిల్ రాజు నవ్వుతూనే ఇచ్చి పడేశారు!
టాలీవుడ్ తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు వార్సీపై మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 21 Aug 2024 1:35 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటూ.. వరుస చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అనేక మంది నటీనటులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టాలీవుడ్ తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు వార్సీపై మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా హీరో నాని, నిర్మాత దిల్ రాజు.. కూడా వార్సీ కామెంట్స్ పై స్పందించారు. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ప్రెస్ మీట్ లో ఇద్దరూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. దిల్ రాజు నవ్వుతూనే ఇచ్చిపడేశారు. "దేశం గర్వించదగ్గ సినిమాలు చేస్తున్నాం.. కానీ నార్త్ వాళ్లు మన హీరోలపై ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా చిన్న చూపు చూపిస్తున్నారు.. లేటెస్ట్ గా ప్రభాస్ పై కూడా".. అంటూ మీడియా ప్రతినిధులు అడిగారు.
దీంతో "ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా.. ఇప్పుడు ఎలా ఉందంటే.. నువ్వే చెబుతున్నావ్ సౌత్ టాప్ లో ఉందని.. ఉందిగా.. ప్రపంచమంతా తెలుసది.. ఎవరో ఒక్కరన్న దానికి మనమెందుకు ఆలోచించాలి" అని దిల్ రాజు ప్రశ్నించారు. ఇంతలో నాని ఇన్వాల్వ్ అయ్యారు. వార్సీ పేరు ఎత్తకుండా సమాధానమిచ్చారు. "నాకు తెలిసి మీరు చెబుతున్న వ్యక్తికి లైఫ్ లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ ఇప్పుడే జరిగిందనుకుంట.. మీరు అన్నెస్ససరీ మ్యాటర్ ను పాపులర్ చేస్తున్నారు" అని అన్నారు.
"దీనికి నేనే నిదర్శనం.. నాపై రాళ్లు పడుతుంటాయి.. ఎందుకు పడతాయి.. పండ్లు ఉన్నాయంట నా దగ్గర.. అందుకే పడతాయి.. సో అది కూడా అంతే.. ప్రభాస్ ను అంటే కదా వాళ్లు హైలెట్ అయ్యేది" అని దిల్ రాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ పై కామెంట్స్ చేసిన వారికి టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా గట్టి కౌంటర్స్ ఇవ్వడాన్ని నెటిజన్లు అంతా ప్రశంసిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని అర్షద్ వార్సీ కామెంట్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయనపై నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అసలు తగ్గడం లేదు. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమాలో హీరో లుక్ బాగోలేదనడం అస్సలు కరెక్ట్ కాదని ట్రోల్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా అంతా ఒక్కటై కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే వీటిపై అర్షద్ వార్సీ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.