Begin typing your search above and press return to search.

మహానటే కావాలంటున్న హీరో ఫ్యాన్స్..!

డైరెక్టర్ హీరో కలిసి ఒక సూపర్ హిట్ కొడితే ఆ కాంబో రిపీట్ అయితే ఆడియన్స్ కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అవుతారు.

By:  Tupaki Desk   |   17 July 2024 12:30 PM GMT
మహానటే కావాలంటున్న హీరో ఫ్యాన్స్..!
X

డైరెక్టర్ హీరో కలిసి ఒక సూపర్ హిట్ కొడితే ఆ కాంబో రిపీట్ అయితే ఆడియన్స్ కి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అవుతారు. అలాంటి కాంబినేషన్స్ టాలీవుడ్ లో చలా జరిగాయి.. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త దర్శకుడనే డౌట్ లేకుండా న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెలకు దసరా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా నానికి ఉన్న క్లాస్ ఇమేజ్ తీసి నానిలో కూడా ఊర మాస్ హీరో ఉన్నాడని ప్రూవ్ చేశాడు.

దసరా సినిమాలో నాని, కీర్తి సురేష్ పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ డైరెక్టర్, హీరో కాంబో రిపీట్ అవుతుంది. నాని ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం తర్వాత సుజిత్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఐతే ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమానే ఉంటుందని టాక్. ఈ సినిమాను కూడా నాని ఇదివరకు సినిమాలకు భిన్నంగా చేయాలన్ అనుకుంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తాయి. తెలుగు ఎంట్రీ ఇవ్వడమే తారక్ దేవర సినిమా చేస్తున్న జాన్వి కపూర్ చరణ్ బుచ్చి బాబు కాంబో మూవీలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక ఇప్పుడు నాని తో శ్రీకాంత్ ఓదెల చేయబోతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తుందని టాక్. ఐతే జాన్వి ఈ సినిమాలో కన్ఫర్మా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఈ విషయం తెలిసిన నాని ఫ్యాన్స్ మాత్రం కీర్తి సురేష్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అంటున్నారు.

దసరాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టేసింది. మళ్లీ అదే కాంబో సినిమా కాబట్టి హీరోయిన్ గా కీర్తి నే తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. ఐతే సినిమా కథను బట్టి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని బట్టి ఎవరిని తీసుకోవాలన్నది నిర్ణయిస్తారు. నాని శ్రీకాంత్ ఓదెల సినిమాలో కీర్తి సురేష్ అయితే బాగానే ఉంటుంది ఒకవేళ జాన్వి కపూర్ చేసినా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని అంటున్నారు. ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి. దసరా తర్వాత తెలుగులో ఒక్క సినిమా చాన్స్ అందుకోని కీర్తి సురేష్ మళ్లీ దసరా కాంబో సినిమానే చేస్తుందా లేదా ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటుందా అన్నది వేచిచూడాలి.