Begin typing your search above and press return to search.

అసలు బారమంతా నాని మీదే..

నాచురల్ స్టార్ నాని కమిట్ అయిన ఏ సినిమాకి అయిన సరే పెర్ఫార్మెన్స్ పరంగా 100 శాతం న్యాయం చేస్తాడు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 6:41 AM GMT
అసలు బారమంతా నాని మీదే..
X

నాచురల్ స్టార్ నాని కమిట్ అయిన ఏ సినిమాకి అయిన సరే పెర్ఫార్మెన్స్ పరంగా 100 శాతం న్యాయం చేస్తాడు. దర్శకుడు కోరుకున్న అవుట్ ఫుట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అందుకే నానిని డైరెక్టర్స్ హీరో అని కూడా చాలా మంది అంటారు. కొత్త దర్శకులు చాలా మందిని నాని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. మూవీని పెర్ఫెక్ట్ గా పూర్తి చేసి తరువాత ప్రమోషన్స్ బాధ్యతని నాని తీసుకుంటాడు. కంప్లీట్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా తన భుజాలపై వేసుకొని సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్లే ప్రయత్నం నాని చేస్తాడు.

అందుకే నాని సినిమాలు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటాయి. దసరా సినిమాకి దర్శకుడు శ్రీకాంత్ ఓదేల కొత్తవాడు. దీంతో ఆ మూవీ ప్రమోషన్స్ బాధ్యత అంతా నాని తీసుకొని అద్భుతంగా కంటెంట్ ని మార్కెట్ లోకి పంపించాడు. అందుకే ఏకంగా 24+ కోట్ల ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చాయి.

తరువాత హాయ్ నాన్న సినిమాకి కూడా అదే స్థాయిలో నాని ప్రమోషన్స్ చేశాడు. అయితే ఈ మూవీ క్లాస్ కంటెంట్ తో తెరకెక్కడంతో మాస్ ఆడియన్స్ కి వెంటనే రీచ్ కాలేదు. అయిన కూడా హాయ్ నాన్న సినిమాని మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ మొత్తం నాని దగ్గరుండి చూసుకుంటున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా కనిపించలేదు. కంప్లీట్ గా ఆయన పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉన్నారు.

వివేక్ ఆత్రేయతో నాని చేస్తోన్న రెండో సినిమా ఇది. అయిన కూడా అతని వర్క్ మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే ప్రతి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వివేక్ ఆత్రేయ టాలెంట్ గురించి నాని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ సర్కిల్ లో సరిపోదా శనివారం సినిమాకి నాని స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేశారు. వీటిలో ఎస్.జె.సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా పాల్గొన్నారు.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని చెన్నైలో మూడు రోజులు స్పెండ్ చేసి మీడియాతో మాట్లాడటంతో పాటు ఇంటర్వ్యూలు ఇచ్చారు. నెక్స్ట్ కేరళలోని కొచ్చికి వెళ్లి ప్రమోషన్స్ చేశారు. హైదరాబాద్ వచ్చి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే మీడియా మీట్ లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ముంబైలో సరిపోదా శనివారం మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో నాని బిజీగా ఉన్నారు. ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోకుండా సినిమాని జనాల్లోకి వీలైనంత బలంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

మూవీ అవుట్ ఫుట్ బాధ్యత అంతా కూడా వివేక్ ఆత్రేయ చేతిలో పెట్టి ప్రమోషన్స్ మాత్రం నాని దగ్గరుండి చేయడంపై సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇంత బాధ్యతగా మూవీని జనాల్లోకి పంపిస్తున్నాడు కాబట్టే నాని సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.