Begin typing your search above and press return to search.

ఓవైపు నాని.. మరోవైపు టీం.. వేరే లెవెల్ లో!

నేచురల్ స్టార్ నాని.. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Aug 2024 9:30 PM GMT
ఓవైపు నాని.. మరోవైపు టీం.. వేరే లెవెల్ లో!
X

నేచురల్ స్టార్ నాని.. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో మంచి హిట్లు అందుకున్న ఆయన.. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించేందుకు రెడీ అవుతున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేసిన సరిపోదా శనివారం చిత్రంతో ఆడియన్స్ ను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా.. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సందడి చేయనుంది.

దీంతో నాని.. వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. తెలుగులో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన.. ఆ వెంటనే చెన్నైలో సందడి చేశారు. అటు నుంచి మాలీవుడ్ కోసం కొచ్చి.. శాండల్ వుడ్ కోసం బెంగళూరులో ప్రమోషన్స్ నిర్వహించారు. ఇప్పుడు ముంబైలో ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన.. ఇంటర్వ్యూల్లో అన్ని ప్రశ్నలకు క్లియర్ గా ఆన్సర్లు ఇస్తూ వైరల్ అవుతున్నారు. మూవీపై బజ్ కూడా క్రియేట్ చేస్తున్నారు.

హీరో కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలని ప్రూవ్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. రెండు రోజుల్లో 30కు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అయితే హీరోనే కాదు.. మూవీ టీమ్ కూడా అంతే క్లియర్ ప్లాన్ తో ముందుకెళ్తోంది. థియేట్రికల్ రిలీజ్ కు ఐదు రోజుల ముందుగానే బుకింగ్ ఫ్లాట్ ఫామ్స్ లో టికెట్స్ ను విడుదల చేసింది. దీంతో సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. తొలి గంటలో వెయ్యికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

అయితే స్లోగా టికెట్ సేల్స్ జరుగుతున్నా.. ఇంతముందే అందుబాటులోకి వచ్చేస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకే మెల్లగా బుక్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గట్టి ప్లాన్ తోనే మేకర్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ ను త్వరగా స్టార్ట్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు. రీసెంట్ గా స్టార్ హీరోల సినిమాల బుకింగ్స్ రిలీజ్ కు రెండు లేదా ఒక రోజు ముందు స్టార్ట్ అవుతున్నాయి. దీంతో కొన్నిసార్లు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ విషయంలో అదే జరిగింది. మిస్టర్ బచ్చన్ టికెట్లను కాస్త ముందు పెట్టినా.. డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ మాత్రం ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాయి. దీంతో సరిపోదా శనివారం మూవీ టీమ్ మాత్రం.. తెలివిగా అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టేసింది. అలా ఓవైపు హీరో.. మరోవైపు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి ఈ అంశాలన్నీ.. సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతాయో వేచి చూడాలి.