Begin typing your search above and press return to search.

గ‌రం గ‌రంగా నాని యాక్ష‌న్ మోడ్

అత‌డు శివ‌మెత్తే శివుడిలా చెల‌రేగిపోతాడ‌ని సినిమా ఆద్యంతం యాక్ష‌న్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని తాజాగా రిలీజైన గ‌రం గ‌రం సాంగ్ చెబుతోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2024 10:05 AM GMT
గ‌రం గ‌రంగా నాని యాక్ష‌న్ మోడ్
X

ఇటీవ‌లి కాలంలో పాన్ ఇండియాలో ఓ ఊపుతున్న ప‌రిశ్ర‌మ ఏది? అంటే క‌చ్ఛితంగా అది టాలీవుడ్. అందుకే ఈ ప‌రిశ్ర‌మ నుంచి ఏ సినిమా వచ్చినా జాతీయ‌ మీడియా కూడా ఆస‌క్తిగా వేచి చూస్తోంది. నేచుర‌ల్ స్టార్ నానీ హీరోగా తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం'త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. రిలీజ్‌కు కేవలం రెండు నెలలు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి 'గరం గరం' టైటిల్ ట్రాక్ విడుద‌లైంది. ఫస్ట్ సింగిల్ ఈ చిత్రం కాన్సెప్ట్ ఏంటో చెబుతోంది.

ఈ పాట సారాంశం ప్ర‌కారం.. గ‌రంగ‌రంగా కోపోద్రిక్తుడిగా ఉండే యువ‌కుడి (నాని) క‌థ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌డు శివ‌మెత్తే శివుడిలా చెల‌రేగిపోతాడ‌ని సినిమా ఆద్యంతం యాక్ష‌న్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని తాజాగా రిలీజైన గ‌రం గ‌రం సాంగ్ చెబుతోంది. నాని లాంటి అద్భుత‌మైన న‌ట‌నా నైపుణ్యం ఉన్న స్టార్ కి ఒక మాస్ పాత్ర ప‌డితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో తెలిసొస్తుంద‌నే భ‌రోసా కూడా ఈ పాట‌లో క‌నిపిస్తోంది. నానిని మాస్ కమర్షియల్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్న‌ సరిపోదా శనివారం ప్ర‌చారం స‌రి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ పోస్టర్లు హీరో సాధారణ పాత్రలకు దూరంగా మాస్ అప్పీల్‌తో నిండిన పాత్రలో న‌టిస్తున్నాడ‌ని సూచిస్తున్నాయి. గరం గరంలో నాని పాత్ర సూర్య థ్రిల్లింగ్ యాక్ష‌న్ తో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

'గరం గరం' సూర్యలో స్పీడ్‌ని, పాత్ర తీరుతెన్నుల‌ను నిర్వచించింది. సాహిత్యం ఉద్విగ్నంగా ఆక‌ట్టుకుంటోంది. అలాగే సంగీత దర్శకుడు J ఏకేస్ బిజోయ్ రాకింగ్ మ్యూజిక్ ఎంతో ఆక‌ర్షిస్తోంది. గాయకుడు విశాల్ దద్లానీని లోని జోష్‌ని ఉప‌యోగించుకుంటూ బిజోయ్ 'గరం గరం'ని సరికొత్త స్థాయికి ఎలివేట్ చేశాడు. గ‌రం గరం నాని కెరీర్‌లో అరుదైన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా నిలుస్తుంది. ఈ అసాధారణ ఎంపికతో నేచుర‌ల్ స్టార్ అభిమానులు థ్రిల్లింగ్‌గా ఉన్నారని చెప్పాలి.

ప్రతిభావంతుడైన వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన 'సరిపోదా శనివారం'లో ప్రియాంక మోహన్ క‌థానాయిక‌. తమిళ నటుడు, దర్శకుడు SJ సూర్య ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామా క‌థాంశంతో ర‌క్తి క‌ట్టించ‌నుంది. త‌న సినిమాని ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టిగా నిల‌ప‌డం కోసం నాని త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. సరిపోదా శనివారం విడుదలకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెల‌కొంది.