Begin typing your search above and press return to search.

నాని అండ్ కో ఆ సినిమాకి ముహూర్తం!

నేచుర‌ల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `ద‌సరా`, `హాయ్` నాన్న‌తో వ‌రుస‌గా రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఖాతాలో వేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 9:30 AM GMT
నాని అండ్ కో ఆ సినిమాకి ముహూర్తం!
X

నేచుర‌ల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `ద‌సరా`, `హాయ్` నాన్న‌తో వ‌రుస‌గా రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఖాతాలో వేసుకున్నాడు. `సరిపోదా శ‌నివారం`తో హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని చూస్తున్నాడు. ఈ చిత్రం ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. `అంటే సుంద‌రం` ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌న‌ప్ప‌టికీ నాని ఎంతో న‌మ్మ‌కంతో వివేక్ ఆత్రేయ‌కి మరోసారి అవ‌కాశం ఇచ్చి చేస్తోన్న సినిమా ఇది.

నాని న‌మ్మ‌కాన్ని ఆత్ర‌యే నిల‌బెడ‌తాడ‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. మ‌రి ఏం చేస్తాడు? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. అలాగే నాని, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. ద‌స‌రా త‌ర్వాత మ‌రోసారి చేతులు క‌ల‌డంతో కాంబో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వేణుతో `ఎల్ల‌మ్మ` సినిమాని ర‌ద్దు చేసి మ‌రీ శ్రీకాంత్ కి అవ‌కాశం ఇచ్చాడు. శ‌నివారం రిలీజ్ అనంత‌రం ఈ సినిమానే మొద‌ల‌వుతుంది.

అయితే ఈ చిత్రంతో పాటు `హిట్ -3` చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాల‌ని నాని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో ఇక ఆల‌స్యం చేస్తే బ‌జ్ త‌గ్గుంద‌నే అంచ‌నాతో ఈ చిత్రాన్ని ప్రారంభించాల‌ని చూస్తున్నాడుట‌. ఇప్ప‌టికే శేలేష్ కొల‌ను క‌థ‌ని వినిపించ‌డం లాక్ చేయ‌డం జ‌రిగింది. కానీ కొంచెం గ్యాప్ తీసుకుని చేయాలి? అన్న ఆలోచ‌న‌తో మొద‌లు పెట్ట‌లేదు. కానీ ఈ మ‌ధ్య‌నే నాని-శేలేష్ భేటి అయి ఎక్కువ‌గా ఆల‌స్యం చేయోద్ద‌ని, వీలైనంత త్వ‌ర‌గా మొద‌లు పెట్ట‌డ‌మే మంచిద‌ని చ‌ర్చించుకున్నారుట‌.

దీంతో శేలేష్ కూడా తాను సిద్దంగానే ఉన్నాన‌ని సంకేతాలు ఇచ్చాడుట‌. ఈ చిత్రాన్ని నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్ట‌ర్ నిర్మిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `హిట్ -2` క్లైమాక్స్ లో నాని హీరో అని ముందుగానే రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రాన్ని కూడా నాని సంస్థ‌నే నిర్మించిన సంగ‌తి తెలిసిందే.