Begin typing your search above and press return to search.

సుద‌ర్శ‌న్ 35MM వద్ద నాని భారీ కటౌట్‌

స్టార్ హీరోలు మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్, ప్ర‌భాస్, బ‌న్ని, ఎన్టీఆర్ ల‌కు భారీ క‌టౌట్లు పెట్ట‌డం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 5:10 AM GMT
సుద‌ర్శ‌న్ 35MM వద్ద నాని భారీ కటౌట్‌
X

స్టార్ హీరోలు మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్, ప్ర‌భాస్, బ‌న్ని, ఎన్టీఆర్ ల‌కు భారీ క‌టౌట్లు పెట్ట‌డం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే. ఇప్పుడు ఇదే కేట‌గిరీలో చేరిపోయాడు నాని కూడా. నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస హిట్ల‌తో దూకుడు మీదున్నాడు. దసరా -హాయ్ నాన్న వరుస విజయాల నేపథ్యంలో నాని అభిమానులు సరిపోదా శనివారం చిత్రాన్ని కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఇప్పుడు హ్యాట్రిక్ కొట్ట‌డ‌మే అత‌డి ధ్యేయం. అందుకే నాని న‌టించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా-`సరిపోదా శనివారం` చిత్రాన్ని బ్లాక్ బస్ట‌ర్ చేయ‌డ‌మే ధ్యేయంగా అతడి కోసం ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. స‌రిపోదా శ‌నివారం ఈ గురువారం నాడు (ఆగస్ట్ 29న) ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో భారీగా విడుదలవుతోంది. ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కి ఉన్న హైప్ అంచనాలు దాదాపు అన్ని సెంటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లలో జోరుకు సాయ‌ప‌డుతున్నాయి.

ఇంత‌లోనే నాని క‌టౌట్ ఒక‌టి యువ‌త‌రంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. యాంగ్రీ యంగ్ మాన్ అవతార్‌లో నాని భారీ కటౌట్ ఒక‌టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో నాని అభిమానులు ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క‌టౌట్ నాని కెరీర్ లోనే అత్యంత ఎత్త‌యిన క‌టౌట్ అన్న చ‌ర్చా సాగుతోంది. ఇటీవ‌లి కాలంలో యాక్ష‌న్ సినిమాల‌తో నెమ్మ‌దిగా మాస్ లో త‌న ఇమేజ్ ని పెంచుకున్నాడు నాని. దానికి త‌గ్గ‌ట్టే క‌టౌట్ రేంజ్ కూడా పెరిగింద‌ని భావిస్తున్నారు.

`సరిపోదా శనివారం`లో కోలీవుడ్ స్టార్స్ ఎస్‌జె సూర్య , ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య తన డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. టాలెంటెడ్ యువ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. హైప్ దృష్ట్యా `సరిపోదా శనివారం` భారీ ఓపెనింగులు సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.