నేషనల్ అవార్డ్స్.. నాని కూడా హర్ట్ అయ్యాడు
అయితే దీనిపై నేచురల్ స్టార్ నాని ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 25 Aug 2023 10:01 AM GMTతెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. వసూళ్లపరంగానే కాకుండా పురస్కారాల పరంగానూ స్టామినా ఏంటో నిరూపిస్తోంది. తాజాగా భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ జాతీయ పురస్కారాల్లో ఏకంగా 11 పురస్కారాల్ని అందుకొని తెలుగు సినిమా గర్వపడేలా చేసింది. దీనిపై తెలుగు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తూన్నారు. ముఖ్యంగా గత 69ఏళ్లలో తొలిసారి టాలీవుడ్ తరఫున బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ కు స్పెషల్ విషెస్ చెబుతున్నారు.
అయితే దీనిపై నేచురల్ స్టార్ నాని ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అల్లుఅర్జున్ పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన మూవీటీమ్ తో పాటు దేశవ్యాప్తంగా పురస్కారాలు అందుకున్న ప్రతిఒక్కరికీ విషెస్ తెలిపిన ఆయన తమిళ సూపర్ హిట్ సినిమా జైభీమ్ కు ఎటువంటి పురస్కారం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నానినే కాదు చాలా మంది ఈ సినిమాకు పురస్కారాలు దక్కకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. వెనకబడిన వర్గాలపై కొందరు పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారు అనే కాన్సెప్ట్ తో న్యాయవాది చంద్రు జీవితం ఆధారంగా వచ్చిన చిత్రమిది. ఈ చిత్రంతో చంద్రు పాత్రలో సూర్య కనబరిచిన నటన చాలా అద్భుతంగా ఉంది. 2022లో జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. అసలీ సినిమాకు జాతీయ అవార్డు కచ్చితంగా వస్తుందని అంతా భావించారు.
సినీవర్గాలు కూడా ఈ చిత్రానికి జాతీయ పురస్కారం దక్కుతుందని అంచనా వేశారు. కానీ తాజాగా అనౌన్స్ చేసిన జాతీయ సినిమా అవార్డ్స్‌లో జైభీమ్ చోటు దక్కకపోవడం ఎంతో మంది సినీ ప్రియులను బాధిస్తోంది. ఈ సినిమా కథ, కథనం, నటన.. జైభీమ్ కు ప్రాణం పోశాయి. సూర్య తన పాత్రకు ఎంత న్యాయం చేశారో.. చిన్నతల్లి పాత్రలో లిజో మోజ్ జోసె కూడా అదే స్థాయిరలో పెర్ఫార్మెన్స్ చేసి ప్రతి ఒక్కరినీ ఏడిపించింది. క్లైమాక్స్ లో అయితే సూర్యతో పాటు సమానంగా పాప కాలు మీద కాలు వేసుకుని పేపర్ చదివే సన్నివేశం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సన్నివేశంతో భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ శక్తి ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించారు. భారత రాజ్యంగం ముందు, న్యాయ వ్యవస్థ మందూ అంతా సమానమ అనే మెసేజ్ ఇచ్చారు.
మరి... కమర్షియల్ సినిమాలకు దక్కిన జాతీయ అవార్డులు.. భారత రాజ్యాంగం నేపథ్యంలో సోషల్ మెసేజ్ ఇస్తూ సెన్సేషన్ క్రియేట్ జైభీమ్ కు దక్కకపోవడంపై చాలా మందికి నిరాశ కలిగించింది. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.