నాని హీరో కాకముందు లవ్ యూ అనేసిన అమ్మాయి!
గాళ్స్ లో నేచురల్ స్టార్ నానికున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున తర్వాత గాళ్స్ లో ఆ రేంజ్ లో పాపులర్ అయిన నటుడు నాని
By: Tupaki Desk | 11 Feb 2024 8:16 AM GMTగాళ్స్ లో నేచురల్ స్టార్ నానికున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున తర్వాత గాళ్స్ లో ఆ రేంజ్ లో పాపులర్ అయిన నటుడు నాని. క్రేజ్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ లాంటి నటులున్నా? నాని ఫాలోయింగ్ మాత్రం ప్రత్యేకమైనది. ఇక నటుడైన తర్వాత అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ సహజమే. పెళ్లి అయినా..పెళ్లి కాకున్నా రోజూ లవ్ యూ అంటూ ఎంతో మంది ప్రపోజ్ చేస్తుంటారు.
ఇది రోజు కనిపించే తంతే. మరి నాని నటుడు కాక ముందు ప్రేమ లేఖలు లాంటివి ఫేస్ చేసాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ విషయాన్ని నాని స్వయంగా రివీల్ చేసాడు. ఇప్పటివరకూ నాని ఎవరికీ ప్రేమ లేఖలు రాయలేదుట. కానీ ఓ ప్రేమలేఖ తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది అంటున్నాడు. ఆ సంగతులు ఏంటో నాని మాటల్లోనే... `నేను సిద్దార్ద రెసిడెన్షియల్స్ లో ఉన్న రోజులవి. డే స్కాలర్ అయిన అమ్మాయిలు రోజు నేనుండే డార్మెటరీ మీదుగానే కాలేజీకి వెళ్లేవారు.
మాతో ఉండే ఓ అబ్బాయి ఓ అమ్మాయి కి రెండోసారి ప్రేమలేఖ రాసాడు. ఆలేఖ లో అతడి వివరాలు ఏవీ చెప్పకుండా తనని ఇష్టపడితే మరునాడు ఎనిమిది గంటలకల్లా డార్మిటరీ వద్దకు వచ్చి కలవమని రాసాడు. మరునాడు అదే సమయానికి నేను నుంచుని ఉన్నా. కాసేపటికి ఓ అమ్మాయి వచ్చి ఒకే అని చెప్పి వెళ్లిపో యింది. నాకేం అర్దం కాలేదు. చివరికి వార్డెన్ పిలిచి తిట్టడంతో నాకు ఆ ఉత్తరం గురించి తెలిసింది.
కానీ నాకూ అమ్మాయిలు పడతారని అప్పుడే అర్దమైంది. నాలోనూ ఆత్మ విశ్వాసం పెరిగింది` అని అన్నాడు. మొత్తానికి నాని ది కానీ ప్రేమ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. తీస్తే మంచి సినిమా అవుతుంది. చక్కని ఎమోషన్ చూపించడానికి ఆస్కారం ఉన్న స్టోరీ. నాని రాస్తే మంచి కథ అవుతుంది. మరి నేచురల్ స్టార్ ఏమంటాడో.