Begin typing your search above and press return to search.

సుజిత్ తో పాన్ ఇండియా మూవీ… క్లారిటీ ఇచ్చిన నాని

నాచురల్ స్టార్ నాని ఆగస్టు 29 సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 6:11 AM GMT
సుజిత్ తో పాన్ ఇండియా మూవీ… క్లారిటీ ఇచ్చిన నాని
X

నాచురల్ స్టార్ నాని ఆగస్టు 29 సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా వచ్చింది. ట్రైలర్ కి పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. మొదటి మూడు సినిమాలు క్లాస్ కంటెంట్ తో చేసిన వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం సినిమాని మాత్రం కంప్లీట్ మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. సినిమాలో నాచురల్ స్టార్ నాని క్యారెక్టర్రైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.

అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఎస్ జె సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా వైలెంట్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. నాని, ఎస్ జె సూర్య మధ్య పోరు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. జేక్స్ బిజోయ్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ట్రైలర్ లోనే స్పష్టమైంది. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో నాని ప్రేక్షకుల ముందుకి వచ్చి సక్సెస్ అందుకున్నారు.

సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకుంటారని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నాని లైనప్ లో మరో మూడు సినిమాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో నాని మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం నడిచింది. ఓవర్ బడ్జెట్ కారణంగా ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు టాక్ తెరపైకి వచ్చింది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదంట. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఈ సందర్భంగా సుజిత్ తో చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ఆ మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. సుజిత్ తో చేయబోయే సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్ అని నాని తెలిపాడు. ఆ చిత్రంలో సుజిత్ తనని చాలా కొత్తగా, మోస్ట్ వైలెంట్ మెన్ గా చూపించబోతున్నాడని నాని చెప్పుకొచ్చాడు. కచ్చితంగా తన కెరియర్ లో సుజిత్ సినిమా చాలా స్పెషల్ అవుతుందని అన్నారు. హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ ఉంటుందని నాని ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

డివివి దానయ్య నిర్మించనున్న ఈ సినిమాని నాని వచ్చే ఏడాదిలో మొదలెట్టే అవకాశం ఉందంట. సరిపోదా శనివారం తర్వాత శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత సుజిత్ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంట. మరో వైపు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాని నాని చేయాల్సి ఉంది. అయితే దానిని సుజిత్ మూవీ కంటే ముందుగా స్టార్ట్ చేస్తాడా లేదంటే తరువాత ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.