Begin typing your search above and press return to search.

నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

ఆమె వయసుతోపాటు ఆదాయం ఎంత అలాగే ఆమె ఎక్కడ పుట్టింది తెలుగు వచ్చా రాదా అని విషయాల గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పింది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 12:17 PM GMT
నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
X

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన నాని ఇప్పుడు ఈ సినిమాతో కూడా అదే తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదల చేశారు.

అలాగే మరో సాంగ్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా నాని హీరోయిన్ మృణాల్ ఠాగూర్ తో కలిసి విభిన్నమైన తరహాలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్నెట్లో రెగ్యులర్గా ఈ స్టార్స్ గురించి ఫ్యాన్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అనే వాటికి సమాధానం ఇచ్చారు.

ముఖ్యంగా నాని తన తొలి రెమ్యునరేషన్ గురించి కూడా చెప్పాడు. ఇక మొదట మృణాల్ ఠాగూర్ కు సంబంధించిన ప్రశ్నలు నాని అడిగాడు. ఆమె వయసుతోపాటు ఆదాయం ఎంత అలాగే ఆమె ఎక్కడ పుట్టింది తెలుగు వచ్చా రాదా అని విషయాల గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్పింది. మృణాల్ ఠాగూర్ తన ఆదాయం గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ నాని మాత్రం తొలి రెమ్యునరేషన్ గురించి తెలియజేశారు.

నాని నటించిన మొదటి సినిమా అష్టా చమ్మా అని అందరికీ తెలిసిన విషయమే. కానీ అంతకంటే ముందు అతను సహాయక దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో వర్క్ చేశాడు. తొలి రెమ్యునరేషన్ సినిమాకు వచ్చిందా లేదా అసిస్టెంట్ డైరెక్టర్ గా అందుకున్నాడా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ మొదట వచ్చిన రెమ్యునరేషన్ 2,500 అని అది కూడా చెక్ రూపంలో వచ్చి బౌన్స్ అయ్యింది అని తెలియజేశారు.

ఇక నాని పెళ్లి గురించి ప్రేమ గురించి కూడా చాలా ప్రశ్నలు రాగా అది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఏ ప్రాజెక్టులు చేస్తున్నారనే విషయంపై ఎక్కువగా అడగగా సరిపోదు శనివారం ప్రాజెక్టు లైన్లో ఉంది అని వివరణ ఇచ్చారు.