Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. ఏపీ తెలంగాణ రైట్స్ ఎంతంటే?

నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అదే ఏడాది చివరలో ఎమోషనల్ హాయ్ నాన్నతో మరో డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:38 AM GMT
సరిపోదా శనివారం.. ఏపీ తెలంగాణ రైట్స్ ఎంతంటే?
X

నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అదే ఏడాది చివరలో ఎమోషనల్ హాయ్ నాన్నతో మరో డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రతి సినిమాకు కూడా కొత్తగా కనిపించేందుకు నాని ఆసక్తి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ సినిమాను వివేక్ ఆత్రేయ తో చేస్తున్న విషయం తెలిసిందే.


ఇదివరకే వీరి కలయికలో అంటే.. సుందరానికి అనే సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే టైటిల్ తోనే డిఫరెంట్ గా ఆకట్టుకున్న దర్శకుడు టైటిల్ పోస్టర్ కూడా వైరల్ అయ్యేలా ప్లాన్ చేశాడు.

సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. దర్శకుడు వివేక్ పై ఓవర్గం ఆడియోన్స్ లో అయితే మంచి అంచనాలు ఉన్నాయి. తప్పకుండా అతను ఈసారి మంచి కంటెంట్ ఇస్తాడు అని అనుకుంటున్నారు. ఇక సినిమాకు ఉన్న డిమాండ్ ను బట్టి థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. సరిపోదా శనివారం.. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడం విశేషం.

ఏపీ తెలంగాణ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిల్ దాదాపు 25 కోట్లకు ఫైనల్ అయినట్లుగా టాక్ వస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు రెండు నిర్మాణ సంస్థలు హడావిడి గట్టిగానే చేస్తున్నాయి. నిర్మాత దానయ్య కు దాదాపు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా టేబుల్ ప్రాఫిట్ దక్కినట్లు టాక్.

నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కూడా మంచి ప్రాఫిట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మరోసారి నాని సినిమా నిర్మాతలకు సేఫ్ జోన్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాతో నాని ఎలాంటి ఫలితం అందుకుంటాడు అనేది ఆసక్తిగా మారింది. సరిపోదా శనివారం తర్వాత నాని మరో ఇద్దరి దర్శకులను కూడా లైన్లో పెట్టాడు. ముఖ్యంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ తో కూడా అతను మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా నాని నుంచి క్లారిటీ రానుంది.