Begin typing your search above and press return to search.

అసలైన పాన్ ఇండియా యాక్టర్ అతనే : నాని

హిందీ డైరెక్టర్ దుల్కర్ కోసం కథ రాస్తారు.. తెలుగు దర్శకులు దుల్కర్ తో సినిమాలు చేస్తారు. అటు మలయాళ డైరెక్టర్స్ కూడా దుల్కర్ తో సినిమాలు చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:44 AM GMT
అసలైన పాన్ ఇండియా యాక్టర్ అతనే : నాని
X

దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోష్లీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కింగ్ ఆఫ్ కోత. ఇన్నాళ్లు సౌత్ ఆడియన్స్ ని తన వెరైటీ కథలతో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని తన లవ్ స్టోరీస్ తో మెప్పించిన దుల్కర్ సల్మాన్ తన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్యాంగ్ స్టర్ కథతో వస్తున్నాడు. కింగ్ ఆఫ్ కోత సినిమాతో దుల్కర్ మరో కొత్త ప్రయత్నాన్ని చేశారు. ఈ సినిమా ఈ నెల ఓనం పండుగ సందర్భంగా రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.

ఈవెంట్ కి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా వచ్చారు. ఈవెంట్ లో నాని మాట్లాడుతూ దుల్కర్ తెలుగు కెరీర్ లో తను కూడా ఒక భాగస్వామ్యం అయ్యానని అన్నారు. దుల్కర్ నటించిన ఓకే బంగారం సినిమాకు తను తెలుగు డబ్బింగ్ చెప్పాను.. ఇక అప్పటి నుంచి అతనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందని అన్నారు. మహానటి, సీతారామం ఇలా తెలుగు ఆడియన్స్ ని మెప్పించే సినిమాలతో దుల్కర్ వస్తున్నారని అన్నారు. అంతేకాదు పాన్ ఇండియా అనే పదం తనకు నచ్చదు కానీ తన దృష్టిలో అసలు పాన్ ఇండియా యాక్టర్ అంటే అది దుల్కర్ మాత్రమే అని అన్నారు.

హిందీ డైరెక్టర్ దుల్కర్ కోసం కథ రాస్తారు.. తెలుగు దర్శకులు దుల్కర్ తో సినిమాలు చేస్తారు. అటు మలయాళ డైరెక్టర్స్ కూడా దుల్కర్ తో సినిమాలు చేస్తుంటారు. ఒక నటుడి కోసం ఇంతమంది సినిమాలు చేయాలని అనుకోవడం వల్లే దుల్కర్ నిజమైన పాన్ ఇండియా యాక్టర్ అని అన్నారు నాని. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కూడా గొప్ప నటి ఆమెతో పాటుగా ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని అన్నారు నాని.

రానా, దుల్కర్ ఇద్దరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందని అప్పుడప్పుడు తనకు కూడా దుల్కర్ లా లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుందని అన్నారు నాని. అయితే నాని అన్న అసలైన పాన్ ఇండియా యాక్టర్ దుల్కర్ అనే కామెంట్ తో మన టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ కాస్త రుస రుసలాడుతున్నారు. అయితే నాని అన్నది దుల్కర్ కోసం అన్ని భాషల దర్శకులు కథలు రాస్తున్నారన్న ఉద్దేశంతో పాన్ ఇండియా యాక్టర్ దుల్కర్ అని అన్నారే తప్ప మరే హీరోని తగ్గించి మాట్లాడటం కానీ కించపరచడం కానీ చేయలేదు.