Begin typing your search above and press return to search.

ఈ థియేట‌ర్ మీలో ఒక‌డిగా న‌న్ను చూసింది: నాని

హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 5:16 PM GMT
ఈ థియేట‌ర్ మీలో ఒక‌డిగా న‌న్ను చూసింది: నాని
X

నేచుర‌ల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ `సరిపోదా శనివారం` ఆగస్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ లో దూకుడు పెంచింది. నేటి సాయంత్రం ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లైంది. హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంది.

కార్య‌క్ర‌మంలో నాని మాట్లాడుతూ-``సుదర్శన్ థియేట‌ర్‌ కి ఒక ప్ర‌త్యేకమైన చ‌రిత్ర ఉంది. మనందరికీ ఈ థియేటర్ చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. జెర్సీ సినిమాని ఇక్కడే చూశాను. దసరా మార్నింగ్ షో ఇక్కడే చూశాను. యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు ఇక్క‌డ‌ చూసాను. ఈ సుదర్శన్ మీలో ఒకడిగా న‌న్ను కూడా చూసింది. మీ ముందు స్టేజ్ పై కూడా చూసింది`` అని థియేట‌ర్‌తో త‌న అనుబంధం గురించి వివ‌రించారు.

ట్రైలర్ ను చూశాక‌.. ఇది ఫోన్ లోనో.. ఇంట్లోనో.. ఫ్రెండ్స్ మధ్యనో చూడటం కాదు. మా వాళ్ళతో కలిసి సుదర్శన్ 35 ఎంఎం లో చూడాలని అప్పుడే ఫిక్స‌య్యాను అని నాని అన్నారు. ఈరోజు అది కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

స‌రిపోదా శ‌నివారం ట్రైలర్‌లో చెప్పుకోదగ్గ విష‌యం దాగి ఉంది. ఇందులో నాని య‌ముడు-చిత్ర‌గుప్తుల‌ను మెర్జ్ చేసిన స‌రికొత్త పాత్ర‌తో ఆక‌ట్టుకుంటున్నారు. నాని తన కెరీర్‌లో ఎక్కువగా పక్కింటి అబ్బాయి పాత్రలు చేశాడు. కానీ దసరాతో న‌టుడిగా గేమ్ ని మార్చాడు. గ్రామీణ యువ‌కుడిగా అద్భుత మేకోవ‌ర్ తో ఆశ్చర్యపరిచాడు. సరిపోదా సినిమాతో నాని నెక్స్ట్ లెవెల్ చూపించ‌బోతున్నాడ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఇందులో ఎస్.జె సూర్య పాత్ర చాలా ప్ర‌త్యేకంగా అల‌రించ‌నుంది. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలంటే ఆగస్ట్ 29 వరకు ఆగాల్సిందే. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక కాగా, సాయికుమార్‌ మరో కీలక పాత్ర పోషించారు.