నాని పవర్ఫుల్ లైనప్.. వ్వాటే స్టోరిస్!
ఈ రెండు సినిమాల్లో నాని కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ తో అలరించాడు.
By: Tupaki Desk | 25 Feb 2024 9:30 AMనాచురల్ స్టార్ నాని 'దసరా' మూవీతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత నాని ఇమేజ్, మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దసరా తర్వాత వచ్చిన 'హాయ్ నాన్న' కూడా డీసెంట్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లో నాని కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ తో అలరించాడు.
కంటెంట్ ఉన్న కథలు ఎంచుకొని టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫామెర్ గా పేరు తెచ్చుకున్న నాని త్వరలోనే 'సరిపోదా శనివారం' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత నాని లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిన్న నాని బర్త్డే సందర్భంగా అతని అప్కమింగ్ మూవీస్ కు సంబంధించి అప్డేట్స్ వచ్చాయి. ముందుగా సరిపోదా శనివారం గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ కాస్త సినిమా పై అంచనాలను పెంచేసింది. హింసకి దూరంగా ఉండే ఓ సాధారణ యువకుడు వారంలో ఒక్కరోజు అది కూడా శనివారం హింసాత్మకంగా మారితే ఎలా ఉంటుందినే యూనిక్ పాయింట్ తో ఈ సినిమా ఉండబోతోంది. నానితో 'అంటే సుందరానికి' సినిమాని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఓ యూనిక్ పాయింట్ తీసుకొని కంప్లీట్ కమర్షియల్ మూవీని తెరకెక్కిస్తున్నారు.
దీని తర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #Nani32 పేరుతో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సినిమా ఎలాంటి పాయింట్ తో ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసారు. వైలెంట్ ని తగ్గించి సంగీతానికి ప్రయారిటీ ఇవ్వాలంటూ ఇందులో చూపించారు. కొందరు విలన్స్ పరిగెడుతుంటారు. వారిని ఓ వ్యక్తి కొట్టి పడేస్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా ప్రధాన కథాంశమని చూపించారు. అంతేకాదు ఓ హింసత్మకమైన వ్యక్తి అహింసాత్మకంగా మారితే అతని జీవితం ఎలా తలకిందులు అయింది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఇందులో నాని పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో అతను హింసను ఎందుకు వీడాడు? ఆ తర్వాత ఆయన లైఫ్ ఇలా చేంజ్ అయింది అనే థీమ్ తో ఈ సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. 'OG' లాగే ఇందులోనూ గన్స్, బుల్లెట్స్ ని హైలైట్ చేసి చూపించారు. దీని తర్వాత బలగం వేణుతో విలేజ్ బ్యాక్ డ్రాప్ రూరల్ ఎమోషనల్ డ్రామా చేయబోతున్నాడు నాని. దిల్ రాజు ప్రొడక్షన్లో రూపొందనున్న ఈ సినిమాకి 'ఎల్లమ్మ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. మొత్తంగా ఈసారి నాని పలు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని అలరించబోతున్నాడు.