Begin typing your search above and press return to search.

టెన్షన్ అయితే లేదు: నాని

టాలీవుడ్ లో చాలా మంది యాక్టర్స్ కెరియర్ ఆరంభంలో సక్సెస్ లు అందుకొని ఆ తరువాత వరుస డిజాస్టర్స్ తో ఆశించిన స్థాయిలో ఫేమ్ సొంతం చేసుకోలేకపోయారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 8:30 AM GMT
టెన్షన్ అయితే లేదు: నాని
X

టాలీవుడ్ లో చాలా మంది యాక్టర్స్ కెరియర్ ఆరంభంలో సక్సెస్ లు అందుకొని ఆ తరువాత వరుస డిజాస్టర్స్ తో ఆశించిన స్థాయిలో ఫేమ్ సొంతం చేసుకోలేకపోయారు. కెరియర్ ని బిల్డ్ చేసుకునే క్రమంలో కథల ఎంపిక, ట్రెండింగ్ కి తగ్గట్లుగా సినిమాలు చేయకపోవడం వలన చాలా మంది హీరోలు స్టార్ ఇమేజ్ ని అందుకోలేకపోయారు. మరికొందరు కెరియర్ ఆరంభంలో వచ్చిన ఫేమ్ తో స్టోరీస్ పూర్తిగా వినకుండా సినిమాలు అంగీకరించడంతో ఎక్కువ ఫెయిల్యూర్స్ ని చూడాల్సి వస్తోంది.

అయితే నాచురల్ స్టార్ నాని మాత్రం కెరియర్ ఆరంభంలో సక్సెస్ లు అందుకున్నారు. తరువాత కూడా తన దగ్గరకి వచ్చిన ప్రతి కథని కూడా ఒకే చేయకుండా సెలక్టివ్ గా మూవీస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే నానితో పాటు హీరోలుగా కెరియర్ ప్రారంభించిన వారు వెనుకబడిపోయారు. అయితే నాని మాత్రం టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ యాక్టర్ గా తన ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు.

ఒకే తరహాలో సినిమాలు కాకుండా భిన్నమైన కథ, కథనాలతో నాని మూవీస్ చేయడం వలన ఆయన హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు. నాచురల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో గత ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మాస్ కథలకి ప్రేక్షకుల నుంచి ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో సరిపోదా శనివారం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని నాని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ పబ్లిషర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరియర్ గురించి నాని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరియర్ పట్ల ప్రస్తుతం అభద్రతాభావంతో లేనని నాని ఇంటర్వ్యూలో చెప్పారు. కెరియర్ ఆరంభంలో సినిమాలు, కెరియర్ పరంగా కొంత ఇన్ సెక్యూర్ గా ఉండేవాడిని అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అలంటి టెన్షన్ అయితే లేదు. వీలైనన్ని కొత్త కథలతో సినిమాలు చేయాలనే ఇంటరెస్ట్ పెరిగింది.

దీనికి కారణం క్రాఫ్ట్స్ మీద ఉన్న ప్రేమ అంటూ నాని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే కేవలం బడ్జెట్ పరంగా మార్పులు ఉంటాయేమో కానీ సినిమాలు మాత్రం ఆగవు. కెరియర్ పరంగా అన్ని రకాల ఎత్తుపల్లాలు నేను చూసుకొని వచ్చాను. అన్ని బాధలు అనుభవించాను. అందుకే ఇప్పుడు కెరియర్ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. ప్రతి సినిమాకి నా వరకు ఎంత సాధ్యం అవుతుందో అంత కష్టపడతాను. టెన్షన్ తీసుకునే ఛాన్స్ అయితే లేదని నాని ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.