హాయ్ నాన్న : రియల్ లైఫ్ లో మిస్ అవుతున్నా..!
నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే
By: Tupaki Desk | 9 Nov 2023 1:13 PM GMTనాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే షురూ అయ్యాయి. నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ లో నాని మరియు మృణాల్ లు పాల్గొంటున్నారు.
తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాయ్ నాన్న సినిమాలో భాగంగా పాపకు తండ్రిగా నటించడంతో తనకు ఒక కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుందట. ఈ విషయాన్ని ఆయన చాలా ఎమోషనల్ గా చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు నాన్నగా నటించినప్పుడు కలగని ఫీల్ ఇప్పుడు కూతురు కు తండ్రిగా నటిస్తే కలుగుతోంది.
నానికి ఇప్పటికే కొడుకు ఉన్నాడు. కనుక బిడ్డ కోసం ప్రయత్నిస్తే పాయే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలు ఉన్న వారు చాలా మంది హీరోలు అమ్మాయిలు ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్టీఆర్ కూడా తనకు కూతురు ఉంటే బాగుండేది అనుకుంటాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు నాని కూడా తనకు కూతురు లేకపోవడం వెలితిగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. రీల్ లైఫ్ లో కూతురికి తండ్రిగా నటించిన నానికి రియల్ లైఫ్ లో కూతురును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఒక అమ్మాయికి తండ్రిగా నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. అమ్మాయిలను ఎలా చూసుకోవాలి, అమ్మాయిలతో ఎలా మెలగాలి అనే విషయాలను ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను అన్నాడు.
శౌర్యువ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో నాని చాలా కొత్తగా కనిపిస్తాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. చాలా కాలంగా నాని కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా తో నాని కి ఆ సక్సెస్ దక్కేలా ఉందని, అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కూడా నాని పేరు మారుమ్రోగే విధంగా ఈ సినిమా ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.