Begin typing your search above and press return to search.

నాని రెమ్యునరేషన్ లెక్క.. మరీ ఈ లెవెల్లోనా

నేచురల్ స్టార్ నాని దసరా సినిమా బ్లాక్ బస్టర్ తో తన ఇమేజ్ ని అమాంతం పెంచేసుకున్నారు. దసరా మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ హీరోగా నానిని మార్చేసింది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:13 AM GMT
నాని రెమ్యునరేషన్ లెక్క.. మరీ ఈ లెవెల్లోనా
X

నేచురల్ స్టార్ నాని దసరా సినిమా బ్లాక్ బస్టర్ తో తన ఇమేజ్ ని అమాంతం పెంచేసుకున్నారు. దసరా మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ హీరోగా నానిని మార్చేసింది. సినిమా సినిమాకి వేరియేషన్ చూపించే నాని ప్రస్తుతం హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. శౌర్యువ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హాయ్ నాన్న సినిమాలో నటిస్తోంది. దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నాని రెమ్యునరేషన్ అమాంతం పెంచేశారు. హాయ్ నాన్న చిత్రానికి ఏకంగా 22 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారంట. నెక్స్ట్ డివివి దానయ్య నిర్మాణంలో వివేక్ ఆత్రేయతో మూవీకి కమిట్ అయ్యారు. అలాగే శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో కోలీవుడ్ దర్శకుడు శిబితో ఒక సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

ఈ సినిమాల కోసం ఏకంగా 25 కోట్ల వరకు నాని చార్జ్ చేస్తున్నారంట. రెమ్యునరేషన్ ఎక్కువైనా నాని మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. నానితో సినిమా అంటే 50 కోట్ల బిజినెస్ గ్యారెంటీగా వస్తుంది. మూవీ సూపర్ హిట్ అయితే కలెక్షన్స్ వంద కోట్లకి సమీపిస్తాయి.

ఈ బిజినెస్ లెక్కలు చూసుకునే నానికి ఉన్న డిమాండ్ బట్టి 25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకి వస్తున్నారు హాయ్ నాన్న హిట్ పడితే మరింతగా రెమ్యునరేషన్ పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. టైర్ 2 హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ గా ఇప్పుడు నాని టాప్ లో ఉన్నారు.

ఇలాగే వరుస సక్సెస్ లు పడితే కచ్చితంగా టైర్ 1 హీరోల జాబితాలోకి నేచురల్ స్టార్ వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది. అలాగే శిబి దర్శకత్వంలో చేయబోయే మూవీ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని సమాచారం.