నాని రెమ్యునరేషన్.. అప్పుడే 80 కోట్లా?
ఈ ఏడాది సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు.
By: Tupaki Desk | 1 April 2024 4:15 AM GMTనేచురల్ స్టార్ నాని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. సినిమాలు చేయడంలో నాని వేగంగా ఉన్న కథల ఎంపికల మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా ఉంటున్నారు. అందుకే వరుస హిట్స్ పడుతున్నాయి. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు సూపర్ హిట్స్ ని నాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు.
ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడం విశేషం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధం అవుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ నాని 32 మూవీ సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలోనే తెరకెక్కనుంది. ఈ ఏడాది ఆఖరులో మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతోందంట.
నాని 33 మూవీ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో చేయనున్నాడు. దసరాని నిర్మించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. దసరా తరహాలోనే కంప్లీట్ మాస్ అండ్ కల్ట్ కంటెంట్ తో ఈ సినిమా కూడా ఉండబోతోందని టాక్. దీని తర్వాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ మూవీ నాని చేయనున్నాడంట.
ప్రస్తుతం నాని చేతిలో సరిపోదా శనివారం కాకుండా 4 సినిమాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ ఒక్కో సినిమాకి 20 నుంచి 22 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. ఈ లెక్కన చూసుకుంటే నాలుగు సినిమాలకి మొత్తం 80 కోట్లకు పైగా రెమ్యునరేషన్ నాని అందుకోబోతున్నాడు. ఈ నాలుగు సినిమాలు మేగ్జిమమ్ రెండేళ్లలోనే నాని పూర్తి చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన నాని ఆదాయం ఏడాదికి 40 నుంచి 50 కోట్ల సినిమాల ద్వారానే వస్తోందని స్పష్టం అవుతోంది.
సరిపోదా శనివారం హిట్ పడితే నెక్స్ట్ సినిమాలకి నాని రెమ్యునరేషన్ పెంచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నిలకడైన మార్కెట్ వేల్యూ ఉన్న హీరోగా నాని మాత్రమే ఉన్నాడని అంటున్నారు. అతనితో సినిమా చేసే నిర్మాతలు రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ ని పొందుతున్నారని చెబుతున్నారు. ఓటీటీ డీల్స్ కూడా నాని సినిమాలకి అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా అతని బ్రాండ్ ఇమేజ్ గట్టిగానే ఉంది. అందుకే మినిమమ్ సక్సెస్ చూస్తున్నాడు.