Begin typing your search above and press return to search.

అంటే… సరిపోదా శనివారం?

ప్రతి కథలో బలమైన ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 6:59 AM GMT
అంటే… సరిపోదా శనివారం?
X

నేచురల్ స్టార్ నాని కెరియర్ ఆరంభం నుంచి కథల విషయంలో చాలా సెలక్టివ్ గా జర్నీ చేస్తున్నారు. ఒక్కసారి టచ్ చేసిన స్టోరీ, క్యారెక్టరైజేషన్ ని మరోసారి రిపీట్ చేయడం లేదు. కథల పరంగా, క్యారెక్టర్స్ పరంగా వేరియేషన్ చూసుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్నారు. అందుకే గత కొంతకాలం నుంచి నానికి సక్సెస్ లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి కథలో బలమైన ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అది కూడా నాని సినిమాలు సక్సెస్ కి ఒక కారణం అని చెప్పొచ్చు.

గత ఏడాది దసరా, హాయ్ నాన్నలతో రెండు సూపర్ హిట్స్ ని నాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ మూవీస్ కావడం విశేషం. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. ఆగష్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సరిపోదా శనివారం పక్కా మాస్ బొమ్మలా ఉందనే మాట వినిపిస్తోంది.

గతంలో వివేక్ ఆత్రేయ నానితో అంటే సుందరానికి మూవీ చేశారు. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ మూవీ తెరకెక్కింది. పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఒక్క నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. అయితే అంటే సుందరానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో చాలా ప్లెజెంట్ కథాంశంతో ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నాని కూడా వివేక్ ఆత్రేయ టాలెంట్ ని గుర్తించి మరో అవకాశం ఇచ్చారు.

ఈ సారి ఎలా అయిన బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్న వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ జోనర్ నుంచి బయటకొచ్చి యాక్షన్ కథతో సరిపోదా శనివారం చేశారు. ఆడియన్స్ కి క్యూరియాసిటీ పెంచే విధంగా ఈ కథలో నాని క్యారెక్టర్ ని డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం చూపించే వ్యక్తి తన వాళ్ళని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ చిత్రంలో ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్స్ తో వివేక్ చెప్పబోతున్నాడు.

ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ మంచి ఇంటెన్షన్ తో ఉండబోతోందనే అభిప్రాయం పబ్లిక్ లోకి వెళ్ళింది. యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. మరి అంటే సుందరానికి సినిమాతో నాని, వివేక్ ఆత్రేయ అందుకోలేని సక్సెస్ ని సరిపోదా శనివారంతో అందుకుంటారో లేదో వేచి చూడాలి.