బుడ్డొడే కానీ మహా గట్టోడండోయ్!
నేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2024 1:30 AM GMTనేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. `దసరా`తో వంద కోట్ల మార్కెట్లోకి అడుగు పెట్టిన నాని తదుపరి సినిమాల విషయంలో అంతే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కొత్త వాళ్లకం టే హిట్ ఇచ్చిన దర్శకులతోనే పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. దీంతో పాటు కంటెంట్ కటౌట్ కి సెట్ అవుతుందా? లేదా? అన్న దానిపై విశ్లేషించుకుని ప్రాజెక్ట్ లాక్ చేస్తున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
అలాగే ఫ్యామిలీకి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తున్నాడు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీని మాత్రం మిస్ అవ్వడం లేదు. షూటింగ్ ఉంటే సెట్లో లేదంటే? ఇంట్లో అన్నట్లే లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అన్నట్లు నానికి ఓ కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. అతడి పేరు అర్జున్. ఇదే పేరును నాని నటించిన `జెర్సీ` సినిమాలో హీరో పాత్రకి పెట్టుకున్నాడు. మరి అర్జున్ ఎంత గడుగ్గాయ్ అంటే? నాని పక్కన ఏ హీరోయిన్ నటించినా చూడలేడు.
కేవలం వాళ్లమ్మని మాత్రమే నాని పక్కనే ఊహించుకుంటానని, మరో మహిళ నాన్న పక్కనే కనిపించే సరికి తట్టుకోలేడుట. అందుకే నాని నటించిన కొన్ని సినిమాలు తప్ప అన్ని సినిమాలు చూడ నంటున్నాడు. ఎక్కువగా నాని సోలోగా డాన్సులు చేసిన పాటలు, ఫైట్లు ఉన్న సినిమాలు చూస్తుంటాడుట. అలాగే షూటింగ్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత షూట్ లో ఏం జరిగిందో ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకుం టాడుట.
కానీ నాని మాత్రం అన్ని విషయాలు చెప్పకుండా కొన్ని విషయాలే చెబుతాడుట. అంటే అందులో హీరోయిన్ తో నటించిన విషయాలేవి నాని అర్జున్ కి చెప్పడని తెలుస్తోంది. అలాగే అర్జున్ కి సంగీతం అంటే ఇష్టమట. ఇంట్లో సంగీతం ఎక్కువగా నేర్చుకుంటానని తెలిపాడు. కొన్ని ట్యూన్లు కంపోజ్ చేసి నానికి వినిపిస్తుంటాడుట.