Begin typing your search above and press return to search.

ఇది వివేక్ శివతాండవం.. ఒక బస్తా పేపర్లు ఎక్కువ తీసుకెళ్లండి..!

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 3:47 AM GMT
ఇది వివేక్ శివతాండవం.. ఒక బస్తా పేపర్లు ఎక్కువ తీసుకెళ్లండి..!
X

న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని మెప్పించింది.

మైన్ అందుకున్న నాని ఎక్కడినుంచో వచ్చిన అభిమానులకు, సినీ అభిమానులకు అందరికీ థాంక్స్.. ఈవెంట్ కి వచ్చిన డైరెక్టర్స్ అందరితో తనకు కనెక్షన్ ఉంది. కొంతమందితో పనిచేశా మరికొంతమంది గురించి ఫ్యూచర్ లో తెలుస్తాయి. సినిమా గురించి దాదాపు ఇంటర్వ్యూస్ లో చెప్పేశా రిలీజైన ప్రతి కంటెంట్ కు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం నా సినిమాకు ట్రైలర్ లో ఒక మూమెంట్ ని రిపీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుందని అన్నారు నాని.

డైరెక్టర్ వివేక్ గురించి మాట్లాడుతూ.. వివేక్ గురించి ఇంటర్వ్యూలో చెప్పేశా.. వివేక్ కు ఈమధ్యనే కొడుకు పుట్టాడు పేరు అకిరా శివ ఆత్రేయ. వాడి పేరులో శివ్ ఉంది.. వివేక్ శివ తాండవం మీరు ఆగష్టు 29న చూస్తారని అన్నారు. సినిమా కోసం అందరు కష్టపడుతున్నారు. ఈ సినిమా వివేక్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ కి నేను ఫ్యాన్. నాకు సినిమా రిలీజ్ ముందు ఎలా వస్తుంది.. ప్రమోషన్స్ బిజీలో ఉన్నా ఎలా అనుకున్న టైం లో వెళ్లి జేక్స్ ఇచ్చిన ఆర్.ఆర్ వింటే ఒక్కసారిగా రిలీఫ్ వస్తుందని అన్నారు నాని. అంతేకాదు సినిమాకు వెళ్లేప్పుడు ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండని ఫ్యాన్స్ కి చెప్పారు. జేక్స్ అంత పని పెట్టాడని అన్నారు నాని. వివేక్ పెట్టిన దానికి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది.. కానీ వివేక్ పెట్టిన దానికి రెండు మూడింతలు పెట్టారు. అది మీరు థియేటర్ లోనే చూస్తారని అన్నారు నాని.

కెమెరా మెన్ మురళి గారి గురించి చెబుతూ.. నేను రెండు మూడు టేక్ లకు ఓకే అంటా.. వివేక్ మరో రెండు అడుగుతాడు. మురళి మరో నాలుగు టేకు లు అడుగుతాడు. సినిమా బాగుండాలి అనుకునే వ్యక్తి.. సినిమా కోసం ప్రాణం పెట్టే వ్యక్తి మురళి గారు అని అన్నారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నా.. ఈ సినిమా ఎడిట్ చేయడం చాలా కష్టం ఎడిటర్ చాలా కష్టపడ్డారని అన్నారు.

నిర్మాత దానయ్య గారి గురించి మాట్లాడుతూ.. ఆయన చేసే సినిమాలకు కథ కూడా పూర్తిగా తెలియదు. సెట్ లో వచ్చి అంతా మీరే చూసుకోండని అంటారు. సినిమా మీద ఆయనకు ఉన్న పాజిటివ్ నెస్ తోనే ఆయనకు నిన్ను కోరి, RRR, సరిపోదా శనివారం లాంటి సినిమాలు వచ్చాయని అన్నారు. దానయ్య గారికి ఎక్కడో ఒక మచ్చ ఉందని.. ఈ సినిమాతో కళ్యాణ్ కి మంచి ట్రనింగ్ అయ్యిందని..అతని డిబట్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు నాని.

సినిమాకు పనిచేసిన డైరెక్షన్ డిపార్టెంట్ మెంట్ అంతా ప్రాణం పెట్టారు.వివేక్ ఒక పని రాక్షసుడు.. ఈ సినిమాకు వివేక్ మేమంతా పనిచేసినా సరే తెర మీద కనిపించే దానికి సగం క్రెడిట్ మీకే దక్కుతుందని అన్నారు నాని. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పాత సామెత ప్రకారం చెబితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా అదే సరిపోదా శనివారం అని అన్నారు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆగష్టు 29 చాలా మెమొరబుల్ డే అవ్వబోతుందని నాని అన్నారు.

ఇక యాక్టర్స్ గురించి మాట్లాడుతూ.. సాయి కుమార్ గారు ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన నాకు ఫాదర్ రోల్ చేశారు. సినిమాలో ప్రతి హై మూమెంట్ ఆయనతో మొదలై ఆయనతో ఎండ్ అవుతుందని అన్నారు నాని. అభిరామి.. అలిగారు బాగా చేశారు. ప్రియాంక ఆన్ స్క్రీన్ ఏమో కానీ ఆఫ్ స్క్రీన్ చూస్తే మీరంతా లవ్ లో పడతారని అన్నారు నాని. ఫస్ట్ సినిమా టైం లో ఫ్రెండ్ మాత్రమే ఈ సినిమాతో క్లోజ్ ఫ్రెండ్ అయ్యామని అన్నారు. సూర్య చారు ఈ ట్రాక్ చాలా కాలం గుర్తుండిపోతుందని అన్నారు.

ఇక దయ పాత్రలో నటించిన ఎస్ జే సూర్య గురించి చెబుతూ.. ఈ రోల్ కి సూర్య గారిని అనుకున్నప్పుడు ఆయన చేస్తారా లేదా అని డౌట్ పడ్డాం.. దయ పాత్రకు వివేక్ ఎలా ఊహించుకున్నాడో సూర్య గారు ఆ అంచనాలను మించి చేశారు. సినిమా చూసి బయటకు వచ్చాక మీకు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతారు ఆ తర్వాత మిగతా అందరి గురించి మాట్లాడతారని నాని అన్నారు. సూర్య గారు దయ రోల్ చేసినందుకు థాంక్స్ అని అన్నారు. ఇక సినిమాలో పోతారు మొత్తం పోతారు డైలాగ్ ని చెప్పి తన స్పీచ్ ముగించారు నాని.