నాని సుజిత్ సినిమా ఏమైనట్టు..?
ఇక ఈ సినిమా తర్వాత నాని నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి పనిచేస్తాడని అనౌన్స్ చేశారు
By: Tupaki Desk | 17 Jun 2024 10:30 AM GMTన్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. దసరా తర్వాత నాని నుంచి వస్తున్న మాస్ యాక్షన్ మూవీగా ఇది వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనేలా ఖర్చు పెట్టారని టాక్. వివేక్ ఆత్రేయ తో అంటే సుందరానికీ సినిమా చేసిన నాని ఆ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాడు. అందుకే ఈసారి సరిపోదా శనివారంతో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.
ఇక ఈ సినిమా తర్వాత నాని నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి పనిచేస్తాడని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా డివివి దానయ్య బ్యానర్ లోనే ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న సుజిత్ ఆ సినిమా పూర్తి చేశాక నాని సినిమా చేస్తాడని చెబుతున్నారు. ఐతే సుజిత్, నాని సినిమాకు బడ్జెట్ విషయంలో తేడా లొచ్చాయని టాక్. నాని సినిమాలు మీడియం బడ్జెట్ తో రిస్క్ లేకుండా చేస్తారు.
కానీ సుజిత్ మాత్రం నాని కి డబుల్ బడ్జెట్ కోట్ చేశాడని తెలుస్తుంది. అందుకే నిర్మాత దానయ్య ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గారని అంటున్నారు. ఐతే ఈ సినిమా హీరో డైరెక్టర్ కాంబోని రిపీట్ చేస్తే ప్రాజెక్ట్ వేరే నిర్మాతల చేతుల్లోకి వెళ్లిందని అంటున్నారు. ఐతే ఆ కొత్త నిర్మాతలు ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. దసరా ముందు వరకు నాని సినిమాల లెక్క వేరే కానీ సరీన సినిమా పడితే తాను కూడా 100 కోట్లు కొడతా అని ప్రూవ్ చేశాడు నాని.
అందుకే సుజిత్ నాని సినిమా విషయంలో కోట్లు ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరోసారి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. నాని, సుజిత్ ఈ కాంబో సెట్ అయితే మాత్రం న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటారని చెప్పొచ్చు. సరిపోదా శనివారం హిట్ పడితే మాత్రం నాని నెక్స్ట్ సినిమాకు మరింత బజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే కాదు నాని బలగం వేణు కాంబోలో ప్లాన్ చేసిన ఎల్లమ్మ సినిమా కూడా బడ్జెట్ విషయంలోనే వెనక్కి తగ్గుతున్నారని టాక్. మరి నాని సినిమాలకు ఇలా ఎందుకు జరుగుతుందో అని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.