Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరిలో నాని హ్యాట్రిక్ ఛాన్స్ ఎవరికో..?

లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు హిట్ సినిమాలను చేసిన నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో వస్తున్నాడు

By:  Tupaki Desk   |   20 Jun 2024 3:51 AM GMT
వాళ్లిద్దరిలో నాని హ్యాట్రిక్ ఛాన్స్ ఎవరికో..?
X

టైర్ 2 హీరోల్లో పర్ఫెక్ట్ స్టోరీస్ తో కెరీర్ ని ఇంకాస్త స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది అనే టాక్ ఎప్పుడో వచ్చినా దాన్ని ఇప్పటికీ నిలబెట్టుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అందుకే నాని ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే దాని పైన ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు హిట్ సినిమాలను చేసిన నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో వస్తున్నాడు.

ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తుండగా సినిమాలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నాని సుజిత్ ఎవరు ఊహించని ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి యాక్టింగ్ స్కోప్ ఉంటుందని తెలుస్తుంది.

కథ మొత్తం కథానాయిక చుట్టే తిరుగుతుందని అంటున్నారు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారు. నానితో నటించిన హీరోయిన్స్ ఇద్దరిలో ఒకరిని ఈ ప్రాజెక్ట్ కి ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ఒకరు సహజ నటి సాయి పల్లవి కాగా మరొకరు మహానటి కీర్తి సురేష్ అని తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా నానితో రెండు సినిమాలు చేశారు. సాయి పల్లవి నానితో ఎం.సి.ఏ, శ్యాం సింగ రాయ్ చేయగా.. కీర్తి సురేష్ నేను లోకల్, దసరా సినిమాల్లో నటించింది.

నానితో సినిమా అంటే ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా ఆసక్తిగా ఉంటారు. ఐతే నాని చాయిస్ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సాయి పల్లవి ఇప్పుడు వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉండటం వల్ల నాని ఛాన్స్ కీర్తి సురేష్ కే వరిస్తుందని అంటున్నారు. ఐతే నాని శ్రీకాంత్ ఓదెల దసరా కాంబో సినిమా వస్తే మాత్రం హీరోయిన్ గా కీర్తిని కూడా రిపీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మరి సుజిత్ సినిమాలో హీరోయిన్ ఎవరో కానీ ఆ అమ్మడికి మాత్రం లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.