ముద్దు గురించి భలే థియరీ చెప్పిన నాని
నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.
By: Tupaki Desk | 27 Nov 2023 6:00 AM GMTనాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం తెలుగేతర రాష్ట్రాల్లో కూడా నాని టీం ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా తమిళ మీడియాతో నాని అండ్ టీమ్ చిట్ చాట్ చేస్తూ హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ చేశారు.
ఆ సందర్భంగా నాని ని తమిళ మీడియా కి చెందిన వారు లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రశ్నించడం జరిగింది. ఫ్యామిలీ మూవీ లో లిప్ లాక్ సన్నివేశం అవసరమా అంటూ ప్రశ్నిండచంతో నాని వారికి భలే సమాధానం ఇచ్చాడు. లిప్ లాక్ సన్నివేశం గురించి నాని చెప్పిన కొత్త థియరీ భలే ఉందే అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
ఇంతకు నాని ఏమన్నాడంటే.. ప్రస్తుతం మనం 2023లో ఉన్నాం. గతంతో పోల్చితే ప్రస్తుతం కాలం చాలా మారింది. కాలంకు తగ్గట్లుగా మనం మారుతున్నాం. మన వ్యక్తిగత జీవితంలో భార్యలను, ప్రేయసిలను ముద్దుపెట్టుకోవడం చాలా కామన్ విషయం. అలాంటిది ఎందుకు సినిమాల్లో పెద్ద విషయం గా చూస్తున్నారు అంటూ నాని ప్రశ్నించాడు.
సినిమాను ప్రేక్షకులకు నేచురల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి నేచురల్ విషయాలను కూడా జొప్పించాల్సిన అవసరం ఉందని లిప్ లాక్ సన్నివేశం గురించి నాని కామెంట్స్ చేశాడు. నిజ జీవితంలో ముద్దులు కామన్ అయినప్పుడు సినిమాల్లో కామన్ అవ్వడంలో తప్పేముంది అంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని చాలా మంది అంటున్నారు. మరి సినిమా విడుదల తర్వాత ఆ ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులు, మీడియా వారు ఎలా తీసుకుంటారో చూడాలి.