Begin typing your search above and press return to search.

నాని సినిమా.. ఈసారి 200 కోట్లా?

వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 5:08 AM GMT
నాని సినిమా.. ఈసారి 200 కోట్లా?
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న నాని.. ఇప్పుడు వరుస చిత్రాలను లైన్ లో పెట్టారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రం చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే నాని ఈ మూవీ తర్వాత సుజిత్ తో వర్క్ చేస్తారని టాక్ వినిపించింది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాత డీవీవీ దానయ్య తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సమస్యలే అందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు మరో ముగ్గురు నిర్మాతలు.. ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్లిందట.

కాగా.. తనకు ఇప్పటికే దసరాతో మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు నాని మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాని ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ బడ్జెట్ కు సంబంధించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బడ్జెట్ అన్ని కోట్లా అని అంతా షాకవుతున్నారు.

ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకాంత్ ఓదెల.. తీసిన దసరా సినిమానే ఇప్పటి వరకు నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇప్పుడు మళ్లీ ఆయనే నాని కెరీర్ లో మరో హైయెస్ట్ బడ్జెట్ సినిమా చేయనుండడం గమనార్హం. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. మూవీ సూపర్ హిట్ పక్కా అని నెటిజన్లు అంటున్నారు.

అయితే ఈ చిత్రాన్ని ఎస్‌ ఎల్‌ వీ సినిమాస్‌ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో నాని నయా లుక్ లో సందడి చేయనున్నారు. మరో కొత్త రోల్ లో అలరించనున్నారు. ఇప్పటికే సినిమాకు వర్క్ చేయనున్న టెక్నీషియన్స్ ను మేకర్స్ ఫిక్స్ చేసేశారు. త్వరలోనే అన్ని వివరాలను అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.