నాని ఎఫెక్ట్.. యూఎస్ లో హాయ్ నాన్న జోరు
అయితే అమెరికాలో హాయ్ నాన్న వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్ సినీ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మ రథం పట్టారు. శుక్రవారం వరకు ఈ సినిమా $710,251 వసూలు చేసిందట.
By: Tupaki Desk | 10 Dec 2023 5:03 AM GMTతెలుగు సినిమా పరిశ్రమకు నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. చైల్డ్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ థాకూర్, బేబీ కియారా ఖన్నా, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 7వ తేదీన రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజు వసూళ్లు బాగా వచ్చినా.,. రెండో రోజు కాస్త తగ్గినట్లు కనిపించింది. ఆ తర్వాత మౌత్ టాక్ తర్వాత మళ్లీ వసూళ్లు ఊపందుకున్నాయి
అయితే అమెరికాలో హాయ్ నాన్న వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్ సినీ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మ రథం పట్టారు. శుక్రవారం వరకు ఈ సినిమా $710,251 వసూలు చేసిందట. శనివారం కలెక్షన్లు కలిపి మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. $1.5 మిలియన్ నుండి $1.8 మిలియన్ వరకు వసూళ్లు రాబట్టొచ్చని అంచనా వేస్తున్నాయి.
టాలీవుడ్ ప్రమోషన్లకు కొత్త వేదికగా మారిన డల్లాస్ లో హీరో నాని పర్యటించారు. ఆ ప్రాంతంలో హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయిన పలు థియేటర్లకు వెళ్లి సందడి చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో కూడా పలు ఫ్యాన్స్ మీట్లు, కార్యక్రమాలు చేయనున్నారు. అమెరికాలో వసూళ్లు పెరుగుతుంటే.. నాని ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి ప్రమోషన్లు చేయనున్నారట.
ఈ సినిమాను వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమాకు అన్ని ఖర్చులతో కలిపి 65 కోట్ల రూపాయలు బడ్జెట్ అయిందట. ఈ సినిమా రిలీజ్‌కు పాజిటివ్‌గా క్రేజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నైజాంలో ఈ సినిమా 8.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సీడెడ్‌లో రూ.2.1 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో రూ.9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 22 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. దీంతో ఈ సినిమా మొత్తంగా రూ.29 కోట్ల మేర వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది. ఇప్పుటి వరకు సినిమా వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్లకు పైగా రాబట్టిందట.