Begin typing your search above and press return to search.

టైర్ 1.. నెక్స్ట్ ఈ ఇద్దరు హీరోలు చేరడం పక్కా..

అలాగే ఈ హీరోల నుంచి వచ్చే సినిమాలు సూపర్ హిట్ అయితే 200+ కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 May 2024 4:34 AM GMT
టైర్ 1.. నెక్స్ట్ ఈ ఇద్దరు హీరోలు చేరడం పక్కా..
X

టాలీవుడ్ లో హీరోల జాబితా టైర్ 1, టైర్ 2, టైర్ 3గా డివైడ్ చేసి ఉంటుంది. టైర్ 1 జాబితాలో కనీసం 100 కోట్ల మార్కెట్ కలిగి ఉన్న హీరోలు ఉంటారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి ఉంటారు. వీరి సినిమాలు తక్కువలో తక్కువ 150 కోట్ల బిజినెస్ చేస్తాయి. అలాగే ఈ హీరోల నుంచి వచ్చే సినిమాలు సూపర్ హిట్ అయితే 200+ కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది.

ఇక టైర్ 2 హీరోల జాబితాలో రవితేజ, నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, నాగ చైతన్య, నితిన్, నిఖిల్, విశ్వక్ సేన్ లాంటి వారు ఉన్నారు. ఈ హీరోల సినిమాలకి 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బిజినెస్ ఉంటుంది. మూవీ కంటెంట్ బట్టి సినిమా బిజినెస్ చేస్తుంది. ఈ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయితే 100 నుంచి 150 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది.

టైర్ 3 జాబితాలో మీడియం రేంజ్ హీరోలు అందరూ వస్తారు. వీరి సినిమాలకి మార్కెట్ తక్కువ ఉంటుంది. అలాగే కలెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. అయితే ప్రస్తుతం టైర్ 2 నుంచి టైర్ 1 జాబితాలోకి వెళ్లగలిగే సత్తా ఉన్న హీరోలు కొంతమంది ఉన్నారు. వారిలో ముందుగా వినిపించే పేర్లు నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు హీరోలకి స్టార్ ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ కూడా ఉంది.

ఇద్దరు ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన వారే కావడం విశేషం. నేచురల్ స్టార్ నాని సినిమాలకి ఈజీగా 50 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీతో నాని రాబోతున్నాడు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఉంది. అలాగే దసరాతో సక్సెస్ ఇచ్చిన శ్రీకాంత్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్నాడు.

ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయితే నాని మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు కొడుతున్నాడు. ఒక్క బ్లాక్ బస్టర్ కోసం విజయ్ వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ VD14 గా తెరకెక్కనుంది. దిల్ రాజు బ్యానర్ లో రవి కిరణ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ జోనర్ మూవీ విజయ్ చేయబోతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో ఈ కథ ఉంటుందంట. ఈ మూడు సినిమాలు హిట్ అయితే విజయ్ టైర్ 1 హీరోల జాబితాలో చేరడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.