Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. ఇది నిజమేనా?

ఇందులో నారా రోహిత్ వయస్సు పెరిగిపోతున్న పెళ్లి కాని యువకుడిగా కనిపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 5:26 AM GMT
నారా రోహిత్.. ఇది నిజమేనా?
X

యువ హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత మరల వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘ప్రతినిధి 2’ తో అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక మరో వైపు ‘సుందరాకాండ’ అనే చిత్రంతో త్వరలో రోహిత్ ముందుకి రాబోతున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో నారా రోహిత్ వయస్సు పెరిగిపోతున్న పెళ్లి కాని యువకుడిగా కనిపించబోతున్నాడు.

రియల్ లైఫ్ లో కూడా నారా రోహిత్ 39 ఏళ్ళ వయస్సులో ఉన్నాడు. అయితే ఇండస్ట్రీలో చాలా మంది ఈ ఏజ్ దాటిన ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. యువ హీరోలు అందరూ కూడా ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడుతున్నారు. నారా రోహిత్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 13 నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరగబోతోందని టాక్ అయితే వినిపిస్తోంది. గతంలో నారా రోహిత్ తో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఆమె ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, పెద్దలని ఒప్పించి పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్ లో జరగబోయే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కి నందమూరి బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబాలు హాజరుకాబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రోహిత్ పెళ్లి ఫిక్స్ చేసారని తెలుస్తోంది. అయితే నారా రోహిత్ కి నారా గిరీష్ అనే అన్నయ్య ఉన్నాడు.

అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే సడెన్ గా రోహిత్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ఇదిలా ఉంటే నారా రోహిత్ ‘బాణం’ సినిమాతో 2009 లో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసాడు. 2011లో ‘సోలో’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2018 వరకు ఏడాదికి 3 సినిమాలు నారా రోహిత్ చేస్తూ వచ్చారు. ఆ తరువాత కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు.

మరల ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డిఫరెంట్ కథలతో రెగ్యులర్ కమర్షియల్ జోనర్ కి భిన్నంగా నారా రోహిత్ మూవీస్ చేస్తాడనే పేరుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా విభిన్న కథలని ప్రేక్షకులకి అందిస్తాడనే అభిప్రాయం నెలకొంది. అలాగే చాలా మంది కొత్త దర్శకులని నారా రోహిత్ టాలీవుడ్ కి పరిచయం చేశాడు.