Begin typing your search above and press return to search.

ఉగాది స్పెషల్.. కాబోయే భార్యతో రోహిత్ క్యూట్ గా!

ఆయన గత మూవీ ప్రతినిధి -2 హీరోయిన్ సిరి లేళ్లతో రోహిత్ నిశ్చితార్థం ఇప్పటికే జరగ్గా.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   31 March 2025 12:27 PM
ఉగాది స్పెషల్.. కాబోయే భార్యతో రోహిత్ క్యూట్ గా!
X

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్.. త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్న విషయం తెలిసిందే. ఆయన గత మూవీ ప్రతినిధి -2 హీరోయిన్ సిరి లేళ్లతో రోహిత్ నిశ్చితార్థం ఇప్పటికే జరగ్గా.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అంతా బెస్ట్ విషెస్ తెలిపారు.


ఇప్పుడు కాబోయే భార్యతో నారా రోహిత్ దిగిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందరినీ ఆకట్టుకుని అలరిస్తున్నాయి. ఉగాది స్పెషల్ గా రోహిత్.. తన అత్తవారింటికి వెళ్లినట్లు క్లియర్ గా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి అల్లుళ్లు.. అత్తవారింటికి వెళ్లడం ఒక సంప్రదాయమని తెలిసిందే.


ఆ విధంగానే వెళ్లిన రోహిత్.. సిరితో సరదాగా గడిపారు. సెల్ఫీతో పాటు కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అందులో ఇద్దరూ హ్యాపీ మోడ్ లో కనిపించారు. క్యాండిడ్ క్లిక్స్ అయితే సూపర్ గా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారగా.. నెటిజన్లు తెగ లైక్లు కొడుతున్నారు. ఫోటోలు అదిరిపోయాయని, సో క్యూట్ అని చెబుతున్నారు.


అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు దివంగత రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్‌. బాణం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. తొలి చిత్రంతో విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. 2011లో సోలోతో ఫస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి పలు సినిమాలు చేశారు.


అనంతరం 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు నారా రోహిత్. రీసెంట్ గా సూపర్ హిట్ మూవీ సీక్వెల్ ప్రతినిధి 2తో సందడి చేశారు. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు సిరి లెళ్ల (శిరీష). ఆస్ట్రేలియాలో చదివిన ఆమె.. జాబ్ కూడా చేశారు.


అయితే సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఆడిషన్స్ కు వచ్చారు. ప్రతినిధి-2 మూవీకి సెలెక్ట్ అయ్యారు. హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సిరి, రోహిత్ కు మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు రోహిత్- సిరి.