Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ఎంగేజ్మెంటా.. ఎవరామే?

హీరో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ ఈ నెల 13న హైదరాబాద్ లో జరగబోతోందని రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Oct 2024 7:31 AM GMT
నారా రోహిత్ ఎంగేజ్మెంటా.. ఎవరామే?
X

హీరో నారా రోహిత్ ఎంగేజ్మెంట్ ఈ నెల 13న హైదరాబాద్ లో జరగబోతోందని రకరకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా నారా రోహిత్ మరల వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అయితే సడెన్ గా ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో ఆయనతో హీరోయిన్ గా నటించిన అమ్మాయినే నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే మాట వినిపించింది.

అయితే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరనే న్యూస్ బయటకొచ్చింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో సిరి లేళ్ల అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా ఆమెకిదే మొదటి సినిమా. ‘ప్రతినిధి 2’ తర్వాత మరల ఇప్పటి వరకు ఎలాంటి సినిమా సిరి లేళ్ళ చేయలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు తన నారా రోహిత్ తో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతుందనే టాక్ తెరపైకి వచ్చింది.

ఇన్ స్టాగ్రామ్ లో సిరి లేళ్ళ యాక్టివ్ గానే ఉంటుంది. అయితే నారా రోహిత్ తో ఎంగేజ్మెంట్ పై ఆమె ఎలాంటి లీక్స్ ఇవ్వకపోవడం విశేషం. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్ష్యంలోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నారా రోహిత్ నటించిన ‘సుందరాకాండ’ అనే మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

మరో వైపు నారా రోహిత్, విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. తమిళ్ మూవీ ‘అమరన్’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉందంట.

2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక పెళ్లి విషయంలో వచ్చే వార్తలపై ఈ జంట క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. సాధారణంగా నారా రోహిత్ రూమర్స్ కాంట్రవర్సీ లకు దూరంగా ఉండే వ్యక్తి. కాబట్టి నిజమైతే అఫీషియల్ గా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు నారా ఫ్యాన్స్ అయితే ఆ అమ్మాయి గురించి ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.