Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ఎంగేజ్మెంట్.. సింపుల్ గానే..

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Oct 2024 7:02 AM GMT
నారా రోహిత్ ఎంగేజ్మెంట్.. సింపుల్ గానే..
X

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు త‌మ్ముడి కొడుకుగా సినిమాల్లో వచ్చిన ఆయన.. స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. డెబ్యూ మూవీ బాణంతో మంచి హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించారు. రీసెంట్ గా ప్రతినిధి-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇప్పుడు ఆ సినిమా హీరోయిన్ సిరి లెళ్లతోనే ఏడడుగులు నడవనున్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో రోహిత్ ఎంగేజ్మెంట్ నేడు జరిగింది. పెద్దనాన్న, పెద్దమ్మ నారా చంద్రబాబు, భువనేశ్వరి ఆధ్వర్యంలో సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. భువనేశ్వరి దగ్గరుండి వివాహ సంబంధం కుదర్చారని వినికిడి.

నేడు జరిగిన నిశ్చితార్థ వేడుకను మొత్తం ఆమెనే పర్యవేక్షించారని తెలుస్తోంది. త్వరలో అధికారికంగా వివాహ తేదీని ప్రకటించనున్నారట. డిసెంబర్ లో నారా రోహిత్ పెళ్లి గ్రాండ్ గా జరగనుందని సమాచారం. అటు రాజకీయ.. ఇటు సినీ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల మధ్య సిరి లెళ్ల మెడలో నారా రోహిత్ మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారట.

ఇక నారా రోహిత్ కెరీర్ విషయానికి వస్తే.. రౌడీ ఫెలో, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్లు, వీర భోగ వసంత రాయలు సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఆరేళ్ల గ్యాప్ తీసుకున్నారు. రీసెంట్ గా ప్రతినిధి 2తో పలకరించినా.. అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు నారా రోహిత్.

ప్రస్తుతం సుందరకాండ మూవీలో నటిస్తున్నారు. వృత్తి వాఘని హీరోయిన్ గా న‌టిస్తున్న ఆ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వ‌హిస్తున్నారు. సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సుందరకాండ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. దాంతోపాటు మరిన్ని సినిమాలు లైన్ లో పెడుతున్నారు రోహిత్.