Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. గ్యాప్ ఇచ్చినా పవర్ఫుల్ కంటెంట్ తోనే..

ఇక బ్రేక్ తీసుకున్న అనంతరం ఒక మంచి కథ సెట్టవ్వడంతో రోహిత్ ప్రకటన కూడా ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   24 July 2023 8:21 AM GMT
నారా రోహిత్.. గ్యాప్ ఇచ్చినా పవర్ఫుల్ కంటెంట్ తోనే..
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కుటుంబం వచ్చిన తొలి హీరో నారా రోహిత్. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా అతని పేరు ఎవరు మర్చిపోలేదు అని చెప్పాలి. ఇక ఈ పేరు ప్రస్తుతం చిత్రసీమలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అందకు కారణం ఓ సినిమా ప్రకటన.





కెరీర్ ఆరంభంలోనే 'బాణం', 'సోలో' చిత్రాలతో సూపర్ హిట్​ను అందుకున్నారు. 2009లో వచ్చిన బాణం సినిమా విమర్శకుల మెప్పు పొందింది. నటుడిగా రోహిత్‌ ప్రతిభేంటో ఆ చిత్రంతో ప్రేక్షకులకు తెలిసింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన 'ప్రతినిధి', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి కథా బలం ఉన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే వాస్తవానికి గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఏ హీరోలు అయినా.. మంచి మాస్ చిత్రాలతో పాతుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మాస్​ హీరోగా గుర్తింపు పొందాలని ఆరాటపడుతుంటారు. కానీ నారా రోహిత్ మాత్రం అలా చేయలేదు. విభిన్నమైన థీమ్​ ఉన్న సినిమాలు చేసి.. ఆడియన్స్​ కు బాగా దగ్గరయ్యారు.

నిజానికి రోహిత్ కు ఒక స్పెషల్ ఫ్యాన్స్ బేస్ అయితే ఉంది. డిఫరెంట్ కంటెంట్ తో వస్తాడని ఓ వర్గం ఆడియెన్స్ అతని సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టాలీవుడ్​ హీరోల్లో ఆ రూట్లో మంచి క్రేజ్ అందుకున్న అతి తక్కువ మందిలో నారా రోహిత్ కూడా టాప్ లిస్ట్ లో ఉంటాడు అని చెప్పవచ్చు.

2016, 2017లో ఏకంగా 'తుంటరి', 'సావిత్రి', 'రాజా చెయ్యి వేస్తే', 'జ్యో అచ్యుతానంద', 'శంకర', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'శమంతకమణి', 'కథలో రాజకుమారి', 'బాలకృష్ణుడు'.. ఇలా తొమ్మిది చిత్రాలు చేశారు. ఇవే కాకుండా అదే ఏడాదిలో గెస్ట్ అప్పియరెన్స్​ చిత్రాలు కూడా చేశారు.

చివరిగా 2018లో ఆయన 'వీరభోగ వసంతరాయలు', 'ఆటగాళ్లు" చిత్రాల్లోనూ నటించి సందడి చేశాడు. కానీ ఆ తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమైపోయారు. తాజాగా ఇప్పుడు ఓ పోస్టర్​ ను రిలీజ్​ చేస్తూ సినిమాను అనౌన్స్​ చేసి తన అభిమానుల్లో ఒక్కసారిగా సర్​ప్రైజ్​ తో పాటు ఉత్సాహాన్ని నింపారు.

కానీ నారా రోహిత్​ సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయంలోకి వెళితే... గ్యాప్ వచ్చింది నిజానికి ఆఫర్స్ లేక కాదు. ఆయనతో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు,దర్శకులు ప్రయత్నించారు. ఎన్నో మంచి మంచి ఆఫర్లను కూడా ఇచ్చారని తెలిసింది. కానీ రెగ్యులర్ సినిమాలు చేయడానికి ఇష్టపడని రోహిత్ విభిన్నమైన కథలను చేయాలనే ఆలోచనలతోనే నిత్యం చర్చలు జరిపేవారు.

అయితే రొటీన్ కథలు కాస్త ఎక్కువగా వస్తుండడంతో ఆయనే కావాలని కాస్త గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ కొత్త తరహా పాయింట్ కథలతో రావాలని అనుకున్నాడు.

ఇక బ్రేక్ తీసుకున్న అనంతరం ఒక మంచి కథ సెట్టవ్వడంతో రోహిత్ ప్రకటన కూడా ఇచ్చాడు. ఇక ఆ కొత్త సినిమాను వానరా ఎంటర్ ​టైన్​మెంట్స్ బ్యానర్ ​పై నారా రోహిత్​ 19వ సినిమా రూపొందించనున్నారు.ఈ సినిమా ఫస్ట్​ లుక్​ ను జులై 24న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్​ ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్​ లోనూ 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు' అని రాసి ఉండటం నారా రోహిత్ డిఫరెంట్ కథతో వస్తున్నట్లు మరోసారి అర్థమైంది. ఈ సినిమా గతంలో వచ్చిన ప్రతినిధికి సీక్వెల్​ అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ సారి రోహిత్ ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో.