హీరోయిన్‌తో నారా రోహిత్ నిశ్చితార్థం
ఈ రోజు ఎలాంటి మీడియా ప్రచారార్భాటం లేకుండా అతడికి నిశ్చితార్థం అయింది.
By: Tupaki Desk | 13 Oct 2024 10:35 AM GMTటాలీవుడ్ లో యువహీరోలంతా ఒక్కొక్కరుగా బ్యాచిలర్ షిప్ వదిలేసి, ఫ్యామిలీమ్యాన్‌లుగా మారుతున్నారు. నితిన్, నిఖిల్, రానా ఇలా యువహీరోలంతా పెళ్లితో ఫ్యామిలీ లైఫ్‌లో సెటిలయ్యారు. ఇప్పుడు నారా రోహిత్ వంతు. ప్రతినిధి 2లో చివరిగా కనిపించిన నారా రోహిత్, తన బ్యాచిలర్ లైఫ్ నుంచి సైలెంటుగా మరలుతున్నారు. ఈ రోజు ఎలాంటి మీడియా ప్రచారార్భాటం లేకుండా అతడికి నిశ్చితార్థం అయింది.
నారా రోహిత్ కాబోయే భార్య శిరీష (సిరీ లెల్లా). ప్రతినిధి 2 లో అతడి సరసన కథానాయికగా నటించింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ప్రైవేట్ వ్యవహారంగా ముగిసింది. నారా రోహిత్ తల్లిదండ్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయుడు, ఎంఎల్ఏ కం హీరో నందమూరి బాలకృష్ణల సమక్షంలో అతడు శిరీష వేలికి ఉంగరం తొడిగారు. ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం జరగనుందని సమాచారం. శిరీష పల్నాడు అమ్మాయి. రోహిత్ తనకు 10 సంవత్సరాలుగా స్నేహితుడు అని తెలిసింది.
వృత్తిపరంగా చూస్తే.. నారా రోహిత్ బాణం సినిమాతో కథానాయకుడు అయ్యాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన సోలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రతినిధి - ప్రతినిధి 2 అతడికి మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం `సుందరకాండ` విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే కొత్త విడుదల తేదీ ఇంకా పెండింగ్‌లో ఉంది.