నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్టు షురూ
బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. సోలో సినిమాతో యూత్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్.
By: Tupaki Desk | 6 Jan 2024 11:28 AM GMTబాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. సోలో సినిమాతో యూత్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్. కథల విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కలిగిన ఆయన.. ప్రతిధ్వని, రౌడీ ఫెలో, అసుర, జ్యో అచ్యుతానంద సినిమాలతో హిట్ లు అందుకున్నారు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు.
కొన్నినెలల క్రితం.. నారా రోహిత్ 19 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా ప్రారంభించారు. 2014లో విడుదలైన ప్రతినిథి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిథి2లో నటిస్తున్నారు. జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ గానే ఈ మూవీ తీస్తున్నారని అంటున్నారు.
ఇక.. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు మరో మూవీని ప్రారంభించారు నారా రోహిత్. దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తన 20వ మూవీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ ఫొటోలను నారా రోహిత్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. అసాధారణమైనదాన్ని అనుభవించడానికి అంతా సిద్ధంగా ఉందని క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించనున్నారు. అరాన్ మీడియా, సందీప్ పిక్చర్ ప్యాలెస్, ఎమ్యూజ్ మెంట్ పార్క్, బ్లాక్ పెప్పర్ ఎంటర్ట్మైమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. 2009లో బాణం సినిమాతో నారా రోహిత్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విమర్శకుల మెప్పు పొందింది. నటుడిగా రోహిత్ ప్రతిభేంటో ఆ చిత్రంతో తెలిసింది. దాంతో ఆయనకు వరుసగా అవకాశాలొచ్చాయి. వేగంగా సినిమాలు చేయడంలో రోహిత్ దిట్ట.
2016, 2017లో తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు చిత్రాల్లో నటించారు రోహిత్. వీరభోగ వసంతరాయలు, ఆటగాళ్లు చిత్రాల్లోనూ నటించి సందడి చేశారు. బాణంలో సన్నగా కనిపించిన రోహిత్, ఆ తర్వాత కాస్త బొద్దుగా మారారు. ఇప్పుడు మళ్లీ నాజూగ్గా కనిపించారు.