నారా రోహిత్.. అందుకే ఐదేళ్ళ బ్రేక్
ఐదేళ్లు కెరియర్ కి బ్రేక్ రావడానికి కారణం ఏంటని మీడియా ప్రతినిధులు నారా రోహిత్ ని ప్రశ్నించారు.
By: Tupaki Desk | 26 Aug 2024 1:01 PM GMTమంచి టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నారా రోహిత్. బాణం సినిమాతో హీరోగా కెరియర్ ప్రారంభించిన నారా రోహిత్ కమర్షియల్ జోనర్ మూవీస్ ఎక్కువ ట్రై చేయలేదు. సోలోతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కాస్తా కంటెంట్ అండ్ డ్రామా బేస్డ్ సినిమాలు చేసాడు. ఇలా చేసిన సినిమాలలో కొన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి.
ప్రతినిధి, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీ ఫెలో లాంటి సినిమాలు నారా రోహిత్ టేస్ట్ ని తెలియజేస్తాయి. నటుడిగా ప్రతి సినిమాలో కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని నారా రోహిత్ ఇచ్చాడు. డిఫరెంట్ కథలతోనే అతని కెరియర్ ఎక్కువగా సాగింది. 2018లో చివరగా నారా రోహిత్ నుంచి వీరభోగవసంతరాయులు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
డిఫరెంట్ అటెంప్ట్ గా అనిపించిన ఈ మూవీ కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. 2017లో హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. వీటిలో ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు. వీరభోగ వసంతరాయులు తర్వాత నారా రోహిత్ ఐదేళ్లు గ్యాప్ తీసుకొని ప్రతినిధి 2 సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు. అదేమీ అంతగా సక్సెస్ కాలేదని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఇక సుదరకాండ అనే మూవీతో త్వరలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మీడియాతో నారా రోహిత్ మాట్లాడారు. ఐదేళ్లు కెరియర్ కి బ్రేక్ రావడానికి కారణం ఏంటని మీడియా ప్రతినిధులు నారా రోహిత్ ని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పొలిటికల్ గా కూడా ఈ ఐదేళ్లు నారా రోహిత్ సినిమాలు చేయకపోవడానికి టీడీపీ అధికారంలో లేకపోవడమే కారణం అనే ప్రచారం జరిగింది. దీనిపై కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
2017, 18లో వరుసగా ఫెయిల్యూర్స్ తో చాలా డిజపాయింట్ అయ్యి కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకున్న. తరువాత కుటుంబ సమస్యలతో వ్యక్తిగతంగా కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో కథల ఎంపికలో కూడా కన్ఫ్యూజన్ వలన ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. వీటిని దాటుకొని వచ్చేసరికి ఈ సమయం పట్టింది. సుందరకాండ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఎలక్షన్స్ కి ముందే అని నారా రోహిత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.