తెలుగు వంటకం వాసనసొస్తేనే మావైపు లగెత్తేవారు?
ఆ రకంగా తెలుగు..హిందీ పరిశ్రమలో ఆయన తిరగని ప్రదేశం అంటూ లేదు.
By: Tupaki Desk | 5 March 2024 4:30 AM GMTదివంగత కోలీవుడ్ లెజెండరీ నడిగర్ తిలగం శివాజీ గణేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పేరుకే తమిళ నటుడ గానీ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. `క్రాస్ పోలినేషన్` అనే పదానికి అసలైన అర్దం ఆయనే. బ్లాక్ అండ్ వైట్ కాలంలో క్రాస్ పొలినేషన్ కి మీనింగ్ తెచ్చిన లెజెండరీ నటుడాయన. తమిళ నటుడైనా తెలుగు..హిందీ భాషల్లోనూ ఎక్కువ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ఆ రకంగా తెలుగు..హిందీ పరిశ్రమలో ఆయన తిరగని ప్రదేశం అంటూ లేదు.
షూటిం గ్ ఎక్కడైనా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. నటీనటులందరితో ఎంతో సరదాగా కలిసిపో యేవారు. తాజాగా శివాజీ గణేశన్ గురించి సీనియర్ నటుడు నారాయణరావు ఆయనతో ఉన్న అనుభవాల గురించి పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే... `తమిళంలో రజనీకాంత్ .. కమల్ తోను.. తెలుగు లో చిరంజీవితో కలిసి నేను చాలా సినిమాలలో నటించాను. చిరంజీవికి సంబంధించిన చాలా సినిమాల స్కిప్ట్ వర్క్ లో నేను పాల్గొంటూ ఉండేవాడిని.
అప్పట్లో 6 భాషలకి సంబంధించిన షూటింగ్స్ చెన్నైలో జరుగుతూ ఉండేవి. అన్ని ఫ్లోర్స్ లో ఉండే ఆర్టిస్టు లంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్లం. అంతస్తులు ..హోదాలకు సంబంధించిన వాతా వరణం అక్కడ కనిపించేదే కాదు. శివాజీ గణేశన్ గారికి తెలుగు వంట కాలు అంటే చాలా ఇష్టం. పక్క ఫ్లోర్ లో తెలుగు సినిమా షూటింగు జరుగుతుందని తెలిస్తే ఆయన భోజనం కోసం వచ్చేసేవారు. తెలుగు వంటకాలు అప్పట్లోనే ఎంతో ఫేమస్. ఎంతో రుచిగా ఉండేవి. మన రుచులకు చాలా మంది తమిళ అభిమానులున్నారు.
శివాజీ గారు తానెంత పెద్ద నటుడైనా అలాంటి ఫీలింగ్ ఎక్కడా చూపించేవారు కాదు. నటీనటులు అందరి తోనూ కలిసిపోయేవారు. అందరితో కలిసి కూర్చుని భోజనం చేసేవారు. తమ సినిమా సెట్స్ కి అందర్నీ రండి అని ఆహ్వానించేరు. `భూకైలాస్` సినిమాను ఒకేసారి తెలుగు .. కన్నడ భాషల్లో చిత్రీకరంచారు. రాజ్ కుమార్ గారు అక్కడే కూర్చుని- ఎన్టీఆర్ గారు ఎలా చేస్తున్నారా అనేది చూసేవారు. అలా అప్పట్లో ఆత్మీయ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ఎవరికివారు వాళ్ల వ్యాన్స్ లో కూర్చుంటున్నారు. షాట్ కి పిలిస్తేనే బయటికి వస్తున్నారు` అని అన్నారు.