Begin typing your search above and press return to search.

గోపీచంద్ 'విశ్వం'.. నరేష్ అలా బుక్కయ్యారేంటి?

కానీ నిన్న జరిగిన గోపీచంద్ విశ్వం మూవీ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ట్రోలింగ్ గురవుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 7:28 AM GMT
గోపీచంద్ విశ్వం.. నరేష్ అలా బుక్కయ్యారేంటి?
X

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్.. కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు నరేష్.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వ్యక్తిగత విషయాలతోపాటు పలు సినిమాల ఈవెంట్స్ లో తన వ్యాఖ్యలతో వైరల్ అవుతుంటారు. ఈసారి ట్రోలర్స్ కు టార్గెట్ గా మారారు!

సాధారణంగా ఏ మూవీ ఈవెంట్ లో అయినా.. నరేష్ ఉంటే చాలు.. నవ్వులు పూస్తాయి. స్టేజీ మీద హుషారుగా మాట్లాడి సందడి చేస్తుంటారు. మీడియాతో చిట్ చాట్స్ లో తన కామెంట్స్ తో నవ్విస్తుంటారు. కానీ నిన్న జరిగిన గోపీచంద్ విశ్వం మూవీ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ట్రోలింగ్ గురవుతున్నారు. కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన, 2024లో విశ్వం మూవీయే అతి పెద్ద హిట్ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

విశ్వం మూవీనే పెద్ద హిట్ అయితే.. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రాల సంగతి ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తేజ సజ్జా హనుమాన్ తోపాటు సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ కూడా హిట్స్ అయ్యాయిగా అని అంటున్నారు. ఆయన కామెంట్స్ తో మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నరేష్.. ఫ్లో లో దసరా అనబోయి 2024 అనేసి ఉంటారని చెబుతున్నారు.

అయితే విశ్వం మూవీ.. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నరేష్ చెప్పినంత పెద్ద హిట్ కాకపోయినా.. మంచి వసూళ్లే సాధించింది. సినీ ప్రియులను నవ్వించింది. దసరా సీజన్‌, లాంగ్ వీకెండ్‌ ను నమ్ముకుని బరిలో దిగిన విశ్వం మేకర్స్ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే చిత్ర యూనిట్ ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది.

అందులో భాగంగానే నిన్న హైదరాబాద్‌ లో విశ్వం సక్సెస్ మీట్ ను గ్రాండ్‌ గా ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే నరేష్ మాట్లాడి వైరల్ అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన విశ్వంలో గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. నరేష్ తోపాటు జిషు సేన్‌ గుప్తా, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్వరలో ఓటీటీలోకి రానుంది విశ్వం మూవీ.