Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ వ్యాపారం బాగుందే !

అల్లరి నరేష్ రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

By:  Tupaki Desk   |   31 May 2024 5:29 AM GMT
అల్లరి నరేష్ వ్యాపారం బాగుందే !
X

అల్లరి నరేష్ రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ సారి సీరియస్ రోల్ లో రౌడీ తరహా క్యారెక్టర్ తో బచ్చలమల్లి అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మేగ్జిమమ్ కంప్లీట్ అయ్యింది. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు సుబ్బు ఈ కథను సిద్ధం చేస్తున్నాడు.

ఇంతకుముందు ఈ దర్శకుడు సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేశాడు. ఇప్పుడు అల్లరి నరేష్ తో సీరియస్ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బచ్చలమల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ని అల్లరి నరేష్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. రఫ్ గా, విలనీ తరహాలో ఈ క్యారెక్టర్ కనిపించబోతోందని లుక్ బట్టి స్పష్టం అవుతోంది.

ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది లిమిటెడ్ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఉంటే ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందంట. తెలుగు రాష్ట్రాలలో 5 కోట్లకి ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ లో 1 కోటికి డీల్ క్లోజ్ అయ్యిందంట.

అంటే 6+ కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇక నాన్ థీయాట్రికల్ డీల్స్ లెక్కలు ఇంకా తెలియాల్సి ఉంది. టేబుల్ ప్రాఫిట్ తో ఈ చిత్రాన్ని నిర్మాత థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా 6.50 కోట్ల షేర్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. నాందితో సీరియస్ క్యారెక్టర్స్ లో కనిపించడం నరేష్ స్టార్ట్ చేశాడు.

ఆ మూవీ హిట్ కావడంతో తనని ఆడియన్స్ సీరియస్ పాత్రలలో చూడటానికి సిద్ధంగా ఉన్నారని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త తరహా కథలతో రియలిస్టిక్ క్యారెక్టర్స్ తో మెప్పించేందుకు బచ్చలమల్లి సినిమా నరేష్ చేస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే నరేష్ నుంచి ఈ తరహా మూవీస్ మరిన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.