Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ న‌రేష్ గోల్డెన్ జూబ్లీ ఉత్స‌వాల్లో ఎయిటీస్ స్టార్స్

శ్రీమతి సూరేపల్లి నంద తన ప్రసంగంలో ఈ ఉద్యానవనం పాత‌త‌రంతో పాటు భవిష్యత్తు తరాలను కలిపే అద్భుతమైన వంతెన అని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 6:55 AM GMT
సీనియ‌ర్ న‌రేష్ గోల్డెన్ జూబ్లీ ఉత్స‌వాల్లో ఎయిటీస్ స్టార్స్
X

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కెరీర్ ఐదు ద‌శాబ్ధాలు పూర్తి చేసుకుంది. ఆగస్టు 11న చిలుకూరులోని ఆయన పల్లె నివాస గృహ ప్రారంభోత్సవంలో డా. నరేష్ విజయకృష్ణ 50 ఏళ్ల మైలురాయి ఉత్స‌వాలు వైభ‌వంగా జ‌రిగాయి. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, విజయకృష్ణ మందిరం , ఘట్టమనేని ఇందిరా దేవి స్పూర్తి వనం (ఇన్‌స్పిరేషన్ పార్క్)ల‌ను ప్రారంభించారు. ఈ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తులు, శ్రీ‌మ‌తి సూరేపల్లి నంద పాల్గొన్నారు. ఇతర విశిష్ట అతిథులు న్యాయమూర్తి ఎన్. మాధవరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్ , సీనియ‌ర్ న‌టుడు జాకీ ష్రాఫ్, నటి శ్రీమతి పూనమ్ ధిల్లాన్, వెట‌ర‌న్ నాయిక‌లు జయసుధ, సుహాసిని మణిరత్నం, కుష్బూ వంటి ప్రముఖులు ఉన్నారు.


శ్రీమతి సూరేపల్లి నంద తన ప్రసంగంలో ఈ ఉద్యానవనం పాత‌త‌రంతో పాటు భవిష్యత్తు తరాలను కలిపే అద్భుతమైన వంతెన అని వ్యాఖ్యానించారు. భావిత‌రం ఫిలింమేక‌ర్స్ కి, ప్రజలకు ఈ పార్క్ తన కానుక అని నరేష్ విజయకృష్ణ(సీనియ‌ర్ న‌రేష్‌) అన్నారు. స్పూర్తి వనం (ఇన్స్పిరేషన్ పార్క్) చలనచిత్ర పరిశ్రమకు అందించిన దిగ్గజాల స్మారక చిహ్నంగా రూపొందింది. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల విగ్రహాలతో దీన్ని ప్రారంభించారు. ఈ స్థలం యువ రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉద్దేశించిన‌ది. భవిష్యత్తులో ఫిల్మ్ లైబ్రరీ, మ్యూజియంను చేర్చే ప్రణాళికలు ఉన్నాయి. పార్క్ అభిమానులకు ప్రజల కోసం ఎల్ల‌పుడూ అందుబాటులో ఉంటుందని న‌రేష్ తెలిపారు.

ఈ వేడుక‌ల్లో నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్ , జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సత్కరించింది. మాదాల రవి, శివబాలాజీ, శ్రీమతి. మహారాష్ట్ర సినీ కళాకారుల సంఘం నుండి పూనమ్ ధిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని మణిరత్నం, కుష్బూ వంటి 80ల నాటి క్లాసిక్ స్టార్స్ కార్య‌క్ర‌మానికి అటెండ‌య్యారు. హీరో లు సాయి ధరమ్ తేజ్, మనోజ్ మంచు, దర్శకుడు మారుతీ, దర్శకుడు అనుదీప్, సాయిరామ్ అబ్బిరాజు, నటుడు అలీ, సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాతలు శరత్ మరార్, రాధా మోహన్‌లతో పాటు తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు విందులో పాల్గొన్నారు.

26 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న నరేష్ విజయకృష్ణ చిత్రం `సత్య`ను ఈ వేదిక వ‌ద్ద ప్ర‌ద‌ర్శించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి త‌దిత‌రులు న‌టించారు. అహూతుల నుంచి ఈ చిత్రానికి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి.