నర్గీస్ బాలీవుడ్ వదిలి వెళ్లిపోవడానికి కారణం?
రాక్ స్టార్, మై తేరా హీరో వంటి హిట్ చిత్రాలలో నటించిన తర్వాత నర్గీస్ ఫఖ్రీ అనూహ్యంగా బాలీవుడ్ నుండి వైదొలిగారు.
By: Tupaki Desk | 15 Jan 2025 12:30 AM GMTరాక్ స్టార్, మై తేరా హీరో వంటి హిట్ చిత్రాలలో నటించిన తర్వాత నర్గీస్ ఫఖ్రీ అనూహ్యంగా బాలీవుడ్ నుండి వైదొలిగారు. చాలా గ్యాప్ తర్వాత హిందీ మీడియా ముందుకు వచ్చిన నర్గీస్ తన కెరీర్‌లో ఎవరికీ తెలియని ఓ టాప్ సీక్రెట్ గురించి మాట్లాడింది. ఓ ఘటన తనను పరిశ్రమ విడిచి వెళ్లేలా బలవంతం చేసిందని వెల్లడించింది. తాను ఐటెం సాంగ్స్ చేయడంతో తక్కువగా చూసారని నర్గీస్ తెలిపింది.
సుభాష్ కె. ఝాతో ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఐటమ్ సంస్కృతికి అలవాటు పడటానికి తనకు కొంత సమయం పట్టిందని, కానీ చివరికి తాను దానిని ఫాలో అయ్యి బాగా ఆస్వాధించానని నర్గీస్ పేర్కొంది. ఐటెం పాటలతో కొంత ప్రతికూలత ఉంది. ఐటమ్ గాళ్ కి గౌరవం తక్కువ అని అర్థం చేసుకున్నానని నర్గీస్ అంది.
తాను ఒక దురదృష్టకర పరిస్థితిలో బాలీవుడ్ వదిలి దూరంగా వెళ్లానని కూడా తెలిపింది. అయితే ఆ దురదృష్టకర ఘటన గురించి అసలు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అయితే పురుషాహంకారం కారణంగానే నర్గీస్ బాలీవుడ్ నుంచి దూరమైందని హింట్ అందింది. పురుషాధిక్యత, అహం ఎదుర్కొన్నానని కూడా అంది. ``మొదట్లో చాలా గొడవలు ఎదుర్కొన్నా. కానీ నాకు కష్టంగా అనిపించింది. కొంతకాలం తర్వాత బాగానే అలవాటు పడ్డాను. సెట్స్‌లో చాలా మంది చాలా చేస్తారు. ముంబైలో ప్రతిదీ సాంస్కృతికంగా మిగతా అన్ని చోట్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంద``ని నర్గీస్ బాలీవుడ్ కల్చర్ గురించి వెల్లడించారు.
స్వల్ప కాలంలో బాలీవుడ్‌లో కొంతమంది అద్భుతమైన వ్యక్తులను కూడా కలుసుకున్నానని, వారితో కలిసి పనిచేశానని పాజిటివ్ సైడ్ విషయాలను కూడా తెలిపింది. నర్గీస్ ఫక్రీ కెరీర్ పీక్స్ లో ఉండగానే నటుడు ఉదయ్ చోప్రాతో ప్రేమాయణం సాగించింది. కానీ ఆ ఇద్దరి మధ్యా బ్రేకప్ అయింది. ఆ తర్వాత అనూహ్యంగా ఈ బ్యూటీ పరిశ్రమ నుంచి దూరమైంది. కానీ తాను బాలీవుడ్ వదిలి వెల్లడానికి ఫలానా కారణం ఉంది అని ఏనాడూ నర్గీస్ వ్యాఖ్యానించలేదు.