Begin typing your search above and press return to search.

వీరమల్లు నర్గీస్‌ రహస్య వివాహం..!

ఇటీవల నర్గీస్ ఫక్రీ తన బాయ్ ఫ్రెండ్‌ టోనీ బేగ్‌ ను వివాహం చేసుకుంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఒకటి రెండు సార్లు మీడియా కంట పడ్డారు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 6:48 AM GMT
వీరమల్లు నర్గీస్‌ రహస్య వివాహం..!
X

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలో నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆమెది గెస్ట్‌ రోల్‌ అయినా సినిమా కథలో ఆమె పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే సినిమా కోసం ఆమె పోర్షన్‌ షూటింగ్‌ పూర్తి చేశారని తెలుస్తోంది. నర్గీస్ ఫక్రీ బాలీవుడ్‌లోనూ ఈమధ్య కాలంలో స్పీడ్‌గా సినిమాలు చేయకుండా స్లో అండ్‌ స్టడీ అన్నట్లుగా సినిమాలు చేస్తోంది. కొత్త సినిమాలకు కమిట్‌ కాకపోవడంకు కారణం ఏంటి అంటూ గత కొన్ని రోజులుగా ఈ అమ్మడి గురించి జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఎట్టకేలకు నర్గీస్ ఫక్రీ ఇండస్ట్రీలో బిజీగా లేకపోవడానికి కారణం తెలిసింది.

ఇటీవల నర్గీస్ ఫక్రీ తన బాయ్ ఫ్రెండ్‌ టోనీ బేగ్‌ ను వివాహం చేసుకుంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఒకటి రెండు సార్లు మీడియా కంట పడ్డారు. కానీ ఆ సమయంలో నర్గీస్ పెద్దగా రియాక్ట్‌ కాలేదు. వ్యాపారవేత్త అయిన టోనీ బేగ్‌తో వివాహం కారణంగా నర్గీస్ ఈమధ్య కాలంలో సినిమాలను తక్కువ చేసింది. రాక్‌స్టార్‌ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అయి అదే పేరుతో రాక్‌స్టార్‌ నర్గీస్ అంటూ పిలిపించుకుంటున్న నర్గీస్ ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. సోషల్‌ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాతో పాటు హౌస్‌ఫుల్‌ 5 సినిమాలోనూ నటిస్తోంది. ఆ సినిమాల షూటింగ్‌ పూర్తి చేసి పెళ్లి పీటలు ఎక్కిన నర్గీస్ తిరిగి సినిమాల్లో నటించేందుకు కొంత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న బ్రేక్ తీసుకుని బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్న నర్గీస్‌కి ఆ సమయంలో ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. నర్గీస్ వివాహం గురించి ముందస్తు సమాచారం లేకపోవడంతో పాటు, ఇండస్ట్రీకి చెందిన వారిని ఆహ్వానించకపోవడం ఇంకా పలు కారణాల వల్ల మీడియా వర్గాల్లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా నర్గీస్‌ టోనీ బేగ్‌ ల వివాహం రహస్యంగా జరిగిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్‌ హోటల్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. వారి సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు నర్గీస్ ఫక్రీ తన వివాహం గురించి బయటకు చెప్పలేదు. సాధారణంగా సెలబ్రెటీలు తమ పెళ్లి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం పెళ్లి ఫోటోలను షేర్‌ చేయక పోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి సీక్రెట్‌ వ్యవహారంగా పెళ్లిని ఎందుకు ఉంచుతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు ముందు అయినా నర్గీస్‌ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా వెళ్లడిస్తుందా లేదా రహస్యంగానే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.