ఫ్లాట్ పక్కనే శ్మశానం.. దెయ్యం మాంసం తినమంది!
తన సినీ కెరీర్ ప్రారంభ రోజుల్లో ముంబైలోని 'హాంటెడ్' అపార్ట్‌మెంట్‌లో నివసించానని వెల్లడించింది
By: Tupaki Desk | 28 July 2023 4:06 AM GMTబాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'రాక్ స్టార్' సహాపలు క్రేజీ చిత్రాల్లో నటించిన నర్గీస్ ఫక్రీ పవన్ కల్యాణ్ 'హరిహరవీరమల్లు' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమవుతోందన్న టాక్ ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం OTTలో అరంగేట్రం చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో నర్గీస్ ఒక భయానక అనుభవం గురించి ఓపెనైంది తన సినీ కెరీర్ ప్రారంభ రోజుల్లో ముంబైలోని 'హాంటెడ్' అపార్ట్‌మెంట్‌లో నివసించానని వెల్లడించింది.
నర్గీస్ తనకు విచిత్రమైన కలలు వచ్చేవని ఆ కలలో ఒక దెయ్యం వెంటాడేదని గుర్తు చేసుకుంది. ''నాకు అపార్ట్‌మెంట్ ఉంది. అది హిల్ రోడ్ (బాంద్రా) స్మశానవాటిక సమీపంలో ఉంది. ఆ ఫ్లాట్ లో ఉన్నంతకాలం నేను వింతైన కలలు కంటూనే ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొంటాను.. అప్పటికే దెయ్యం కలలు.. ఆ దెయ్యం చాలా పిచ్చిగా ఉంటుంది. దెయ్యంలా కనిపించే 6 అడుగుల 5 ఇంచీల వ్యక్తి తెల్లగా లేతగా భయానకంగా కనిపిస్తాడు.
అతను నన్ను స్మశానవాటికకు తీసుకువెళతాడు. అక్కడ తవ్వేవాడు. స్మశానవాటికలో అతని చేయి.. ఆపై మనుషుల ఎముకలను తీసి.. మాంసం తినమని నన్ను అడిగేవాడు... ఆ కల చాలా భయానకంగా ఉంది. వరుసగా నాలుగు రోజులు ఇవే కలలు'' అంటూ నాటి భయానక కలల గురించి గుర్తు చేసుకుంది.
నర్గీస్ ఓసారి బయటకు వెళ్లినప్పుడు ప్యాకింగ్ సమయంలో తన క్యాబినెట్‌లో 'ఆరు చనిపోయిన పిల్ల పక్షులు' కనిపించాయని కూడా గుర్తు చేసుకుంది. ''అది విచిత్రం కాదా? అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అని తెలిపింది. తాను ఆ హాంటెడ్ హౌస్ ని వదిలి ఢిల్లీకి వెళ్లిపోయానని నర్గీస్ వెల్లడించారు.
నర్గీస్ న్యూయార్క్‌లో జన్మించింది. యూరోప్ ఆగ్నేయాసియాలో నివసించింది. తర్వాత బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె ఇంతియాజ్ అలీ రాక్‌స్టార్‌తో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మెయిన్ తేరా హీరో, హౌస్‌ఫుల్ , బాంజో వంటి చిత్రాల్లో నటించింది.