Begin typing your search above and press return to search.

'నారి నారి నడుమ మురారి'ని పరిచయం చేసిన బాలయ్య, చరణ్‌

యంగ్‌ హీరో శర్వానంద్‌ గత ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరిచింది.

By:  Tupaki Desk   |   14 Jan 2025 1:43 PM GMT
నారి నారి నడుమ మురారిని పరిచయం చేసిన బాలయ్య, చరణ్‌
X

యంగ్‌ హీరో శర్వానంద్‌ గత ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరిచింది. గత కొంత కాలంగా కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న శర్వానంద్‌ ఈ ఏడాది బ్యాక్‌ టుబ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు సంక్రాంతి సందర్భంగా శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం శర్వానంద్‌ సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను నందమూరి, మెగా హీరోలు కలిసి విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌, చరణ్ కలిసి శర్వా మూవీ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారని అంతా భావించారు.

అనూహ్యంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ని బాలకృష్ణ, రామ్‌ చరణ్‌లు విడుదల చేశారు. ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోలో రామ్‌ చరణ్‌, శర్వానంద్‌ కలిసి పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ ఎపిసోడ్‌ షూటింగ్‌ సమయంలోనే ఈ సినిమా గురించిన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ హీరోగా నటించి దాదాపు పాతిక ఏళ్ల క్రితం వచ్చిన 'నారి నారి నడుమ మురారి' సినిమా టైటిల్‌ తో ఇప్పుడు శర్వానంద్‌ రాబోతున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఒక వైపు సంయుక్త మీనన్‌, మరో వైపు సాక్షి వైద్యలు ఉన్నారు. ఇద్దరి మధ్య కాస్త ఇబ్బంది కరంగా ఫన్నీగా శర్వానంద్‌ ఫోజ్ ఇచ్చాడు. టైటిల్‌కి జస్టిఫికేషన్‌ అన్నట్లుగా పోస్టర్‌ ఉంది.

సినిమా కథ సైతం ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలిగిపోయే హీరో పాత్ర గురించి ఉంటుంది అని తెలుస్తోంది. నేడు సంక్రాంతి సందర్భంగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ మధ్యలో ఫన్నీగా నలిగి పోయిన వెంకటేష్ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కనుక ఇదే కాన్సెప్ట్‌తో వస్తే కచ్చితంగా శర్వానంద్‌కి చాలా రోజుల తర్వాత కమర్షియల్‌ హిట్ పడటం ఖాయంగా అనిపిస్తోంది. శర్వానంద్‌ ఫస్ట్‌ విడుదలతోనే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేశాడు. సూపర్‌ హిట్‌ సినిమా టైటిల్‌ను టైటిల్‌గా తన సినిమాకు ఎంపిక చేయడం అనేది కచ్చితంగా చాలా పెద్ద రిస్క్‌. అయినా శర్వానంద్‌ ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేశారు.

ఈ సినిమాకు రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా ఉంటుంది అనే సమాచారం అందుతోంది. గతంలో మహానుభావుడు వంటి వినోదాత్మక సినిమాతో శర్వానంద్‌ ఆకట్టుకున్నాడు. కనుక ఈ సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్‌ను చూపించి శర్వానంద్‌ సక్సెస్ దక్కించుకుంటాడు అనిపిస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన నారి నారి నడుమ మురారి ఈ ఏడాది సమ్మర్‌కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.