బుజ్జిని డ్రైవ్ చేసిన భారత తొలి ఫార్ములా వన్ డ్రైవర్
ప్రభాస్ నటించిన `కల్కి 2898 AD` జూన్ 27న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రచారంలో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 May 2024 3:42 AM GMTప్రభాస్ నటించిన `కల్కి 2898 AD` జూన్ 27న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రచారంలో స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవలే బుజ్జి ది రోబోట్ కార్ లుక్ ని రిలీజ్ చేయగా అది బంపర్ హిట్టయింది. ప్రస్తుతం బుజ్జి గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. బుజ్జి- ది సూపర్ రోబో కార్ సినిమాలో ప్రభాస్ కి రైట్ హ్యాండ్ అని టీజర్ తెలిపింది. ముఖ్యంగా ఈ డిజైనర్ వాహనాన్ని తయారు చేయడం కోసం నిర్మాతలు ఏకంగా 7కోట్లు ఖర్చు చేసారన్నది ఆశ్చర్యపరిచింది. మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఈ సూపర్ కార్ తయారీ కోసం తమవంతు సహకారం అందించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రామోజీ ఫిలింసిటీలో జరిగిన బుజ్జి పరిచయ కార్యక్రమంలో ప్రభాస్ ఈ సూపర్ కార్ ని డ్రైవ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్య ఈ కార్ ని డ్రైవ్ చేసి ఆ అనుభవం ఎంతో గొప్పగా ఉందని కితాబిచ్చేసాడు. ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా 1 డ్రైవర్ నరైన్ కార్తికేయన్ రోబో వాహనం బుజ్జిని డ్రైవ్ చేసారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోని వైజయంతి మూవీస్ షేర్ చేయగా అది వైరల్ గా మారింది. నరేన్ ఫ్యూచరిస్టిక్ వాహనం ఇంజనీరింగ్‌పై తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. ``అద్భుతం.. ఇది ఒక స్పేస్ షిప్ లాగా ఉంది`` అని ప్రశంసించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం న్ 27 న విడుదల కానుంది. నరైన్ కార్తికేయన్ ఫార్ములా వన్ రేసర్ గా అందరికీ సుపరిచితం. ఇప్పుడు బుజ్జి ని డ్రైవ్ చేసి ప్రభాస్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాడు. భవిష్యత్ లో అధునాతన వాహనాలు ప్రపంచాన్ని ఎలా శాసించబోతున్నాయో నాగ్ అశ్విన్ తెరపై చూపిస్తున్నారు.