బావ సలహాను ఫాలో అవుతున్న నితిన్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ స్వ్కేర్ సినిమా మార్చి 28న రిలీజై మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటూ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 April 2025 6:31 AMనార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ స్వ్కేర్ సినిమా మార్చి 28న రిలీజై మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటూ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజైన నాలుగు రోజులకే మ్యాడ్ స్వ్కేర్ బ్రేక్ ఈవెన్ అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే రూ.75 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసిన మ్యాడ్ స్వ్కేర్ ఈ వీకెండ్ లోపే రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మ్యాడ్ స్వ్కేర్ ఘన విజయం అయిన కారణంగా చిత్ర యూనిట్ ఇవాళ సక్సెస్ మీట్ ను ఘనంగా ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా రానున్నాడు. ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది నార్నే నితిన్, ఎన్టీఆర్ కు స్వయానా బావ మరిది అవడం అయితే రెండోది నాగ వంశీకి ఎన్టీఆర్ కు ఉన్న బాండింగ్.
ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని నాగవంశీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తుంటాడు. అంతేకాదు త్వరలోనే తన బ్యానర్ లో ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో పాటూ ఎన్టీఆర్ ఓ సినీ ఈవెంట్ లో కనిపించి చాలా రోజులైంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ ను కలుసుకోలేకపోయాడు ఎన్టీఆర్. అందుకే ఈ ఛాన్స్ ను వదులుకోవాలనుకోవడం లేదు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కు తారక్ వస్తున్నాడని తెలిసి తెగ ఆనందిస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే నార్నే నితిన్ కెరీర్ స్టార్ట్ చేశాక ఇప్పటివరకు చేసిన సినిమాలు మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్వ్కేర్. ఈ మూడు సినిమాలతో మంచి హిట్లు అందుకుని హ్యాట్రిక్ కొట్టాడు నితిన్. హ్యాట్రిక్ తర్వాత చేయబోయే సినిమాలు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ట్రై చేస్తున్న నితిన్ కు ఎన్టీఆర్ సలహాలు కూడా కచ్ఛితంగా ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన బావమరిదికి ఒక సలహా ఇచ్చాడట. ఇక ముందు కూడా నితిన్ ను రొమాంటిక్ ఎంటర్టైనర్లే చేయమని ఎన్టీఆర్ చెప్పాడట. వరుస హిట్లు వచ్చాయి కదా అని మాస్, యాక్షన్ జోలికి వెళ్లకుండా లవ్ స్టోరీలపైనే ఫోకస్ చేయమని బావమరిదికి ఎన్టీఆర్ సలహా ఇచ్చాడని, నితిన్ కూడా అదే ఫాలో అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గానే నితిన్ ఒక ప్రేమకథకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇచ్చిన సలహా మంచిదే. ఎందుకంటే బాగా సూటయ్యే జానర్ ను వదిలేసి అనవసరంగా యాక్షన్, మాస్ జోలికి వెళ్లి ఎంతోమంది చేతులు కాల్చుకున్న వైనం చూశాం. అందుకే ఎన్టీఆర్, నితిన్ కు ఈ సలహా ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు.