Begin typing your search above and press return to search.

పంచెకట్టులో మ్యాడ్ కుర్రాళ్ళు.. గేట్ రెడీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కంటెంట్ తో మెప్పిస్తే ఎవరైనా హిట్ సాధించవచ్చు అని నేటితరం కొత్త హీరోలు నిరూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 10:36 AM GMT
పంచెకట్టులో మ్యాడ్ కుర్రాళ్ళు.. గేట్ రెడీ!
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో కంటెంట్ తో మెప్పిస్తే ఎవరైనా హిట్ సాధించవచ్చు అని నేటితరం కొత్త హీరోలు నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆయన తన మొదటి చిత్రం మ్యాడ్ తో మంచి హిట్ కొట్టాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.


మ్యాడ్ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం.ఈ విజయంతో, మేకర్స్ వెంటనే సీక్వెల్ ప్రకటించారు. ఈ సీక్వెల్‌కి మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు, ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రమోషన్ డోస్ కూడా పెంచుతున్నారు.

శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్‌లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముగ్గురు పంచెకట్టులో కనిపిస్తూ, పూర్తిగా న్యూ లుక్ లో కనిపించారు.

మ్యాడ్ సినిమాకి, ఈ సీక్వెల్ లుక్కుకు ఎలాంటి పోలికలు లేకపోవడం గమనార్హం. ఇది ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇక సినిమా పై అంచనాలు పెంచుతూ, చిత్ర బృందం సెప్టెంబర్ 20న మ్యాడ్ స్క్వేర్ సినిమా మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మొదటి సినిమాతోపాటు ఈసారి కూడా ఆయన నుండి సూపర్ హిట్ ఆల్బమ్ రాబోతుందని ఆశిస్తున్నారు.

మొదటి సినిమా సాధించిన విజయాన్ని మించి ఈ సీక్వెల్ మంచి ఎంటర్టైనర్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు.