Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ఖాతాలో అప్పుడే హ్యాట్రిక్!

కాలేజ్ స్టోరీ...న‌లుగురు హీరోల్లో తాను ఒక‌డైనా? త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తొలి సినిమాతోనే ద‌క్కించుకున్నాడు.

By:  Tupaki Desk   |   28 March 2025 1:18 PM
Narne nithin hat trick movie
X

యంగ్ హీరో నార్నే నితిన్ ఖాతాలో తొలి హ్యాట్రిక్ న‌మోదైందా? న‌లుగురు హీరోల్లో తాను ఒక్క‌డైనా ప్రేక్ష‌కుల్లో తానో స్పెష‌ల్ అనిపించాడా? అంటే అవున‌నే అనాలి. 'మ్యాడ్' సినిమాతో నార్నే నితిన్ న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా తొలి సినిమా అదే. యూత్ పుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రిలీజ్ అయిన సినిమా మంచి విజ‌యం సాధించింది. కాలేజ్ స్టోరీ...న‌లుగురు హీరోల్లో తాను ఒక‌డైనా? త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తొలి సినిమాతోనే ద‌క్కించుకున్నాడు.

అటుపై 'ఆయ్' అంటూ మ‌రో సినిమా చేసాడు. గోదారి యాస బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా నితిన్ ని ఇంకాస్త ఎక్కువ‌గా హైలైట్ చేసింది . ఈ రెండు సినిమాలు కూడా ఏడాది గ్యాప్లో నే రిలీజ్ అయ్యాయి. 'మ్యాడ్' 2023 లో రిలీజ్ అవ్వ‌గా....'ఆయ్' 2024 లో రిలీజ్ అయింది. తాజాగా 'మ్యాడ్' కి సీక్వెల్ గా తెర‌కెక్కించిన 'మ్యాడ్ స్వ్కేర్' కూడా రిలీజ్ అయింది.

ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వ‌చ్చింది. దీంతో నితిన్ ఖాతాలో మ‌రో విజ‌యం ప‌డిన‌ట్లే. ఇది నితిన్ మూడ‌వ సినిమా కావ‌డంతో హ్యాట్రిక్ న‌మోదైంది. సినిమాకు తొలి ఆట‌తోనే పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది. యూత్ పుల్ స్టోరీ కావ‌డంతో యువ‌త‌కి ఎక్కేస్తుంది? అన్న ధీమా మేక‌ర్స్ లో క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్ని నాగ‌వంశీ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మీడియా మీట్లో భాగంగా `మా వాడు హ్యాట్రిక్ కొట్టేసాడంటూ నాగ‌వంశీ రివీల్ చేసాడు.

నితిన్ ఈ విష‌యాన్ని పెద్ద‌గా ఫోక‌స్ చేసుకోలేదు గానీ ఇది వాస్త‌వ‌మే. అయితే ఇవేవి సోలో రిలీజ్ లు కాక‌పోవ‌డంతో? నితిన్ ఈవిష‌యాన్ని లైట్ తీసుకున్నాడు. నితిన్ వెరీ డౌన్ టూ ఎర్త్ ప‌ర్స‌నాల్టీ. మూడు సినిమాల‌తోనే ఇండ‌స్ట్రీలో నితిన్ అంటే మ‌న‌వాడు..మంచి వాడు అన్న న‌మ్మ‌కాన్ని , అభిప్రాయ‌న్ని అంద‌రిలో క‌ల్పించ‌గలిగాడు. నితిన్ భ‌విష్య‌త్ కు ఈ పాజిటివిటీ అన్న‌ది మ‌రింత ఎన‌ర్జీని ఇస్తుంది. ఇక‌పై నితిన్ మంచి క‌థా బ‌లం ఉన్న సోలో చిత్రాల‌పై ఫోక‌స్ చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.