ఎన్టీఆర్ బామ్మర్దికి అసలు పరీక్ష!
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్ సినిమాతో గత ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్నారు
By: Tupaki Desk | 1 Aug 2024 5:43 AM GMTజూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్ సినిమాతో గత ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్నారు. అంతకంటే ముందే రెండు సినిమాలు స్టార్ట్ చేసినా అవి ఎందుకనో రిలీజ్ కాలేదు. మ్యాడ్ మూవీలో మరో ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ తో కలిసి నార్నె నితిన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సంగీత్ శోభన్ కామెడీతో మ్యాడ్ సినిమాకి మంచి మైలేజ్ దొరికింది. మూవీ కమర్షియల్ సక్సెస్ అయ్యింది.
ఈ సినిమాలో నార్నె నితిన్ మెయిన్ లీడ్ చేసిన అతని కంటే సంగీత్ శోభన్ కి ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2లో ఆయ్ సినిమాని నార్నె నితిన్ చేశారు. ఈ సినిమాలో ఆయన సోలో హీరోగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆయ్ నుంచి వచ్చిన సాంగ్స్ అయితే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. అనిల్ కంచిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నయన సారిక హీరోయిన్ గా చేస్తోంది. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొదటి సినిమా మ్యాడ్ మూవీ సక్సెస్ తో నార్నె నితిన్ కి కొంత ఫేమ్ వచ్చిన కూడా సోలోగా అతను ఆయ్ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు రామ్ డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాయి.
ఈ రెండు సినిమాలపైన కూడా మంచి హైప్ ఉంది. రెండు మాస్ కమర్షియల్ చిత్రాల మధ్యలో చిన్న సినిమాగా ఆయ్ మూవీ రాబోతోంది. అయితే ఈ సినిమా సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో మూవీ బాగుందనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి సోలోగా నార్నె నితిన్ ఆయ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకోగలడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మాతగా బన్నీ వాస్ 18 పేజెస్, వినరో భాగ్యము విష్ణు కథ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్నారు.
ఆయ్ సినిమా మీద కూడా బన్నీ వాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే బన్నీ వాస్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుంది. బన్నీ వాస్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో మూడు సినిమాలు మాత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. మిగిలినవన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. మరి ఆయ్ మూవీ ఫలితం కూడా అతని గత సినిమాల రిజల్ట్ ని రిపీట్ చేస్తుందా అనేది చూడాలి.